ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విదేశాలకు వెళ్లేవారి కోసం ప్రత్యేక టీకా కేంద్రం.. ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయం

ABN, First Publish Date - 2021-06-15T05:16:26+05:30

ఉద్యోగాలు, చదువుల నిమిత్తం విదేశాలకు వెళ్లే వారి కోసం ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేక టీకా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని ఉపముఖ్యమంత్రి మనీశ్ శిసోడియా సోమవారం నాడు ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: ఉద్యోగాలు, చదువుల నిమిత్తం విదేశాలకు వెళ్లే వారి కోసం ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేక టీకా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని ఉపముఖ్యమంత్రి మనీశ్ శిసోడియా సోమవారం నాడు ప్రకటించారు. ఆగస్టు 31 నాటికల్లా విదేశాలకు వెళ్లాలనుకున్న వారందరూ ఈ కేంద్రం సేవలను వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు. వీరితోపాటు టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారులు కూడా ఈ కేంద్రంలో టీకాలు వేయించుకోవచ్చు. అయితే..ఈ కేంద్రంలో కోవిషీల్డ్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇక్కడ టీకాలు తీసుకోదలచిన వారు..తమ పాస్‌పొర్టుతో పాటూ ప్రయాణం ఖారారైనట్టు రుజువు చేసే ఇతర డాక్యుమెంట్లను చూపించాల్సి ఉంటుంది. కేంద్రం ప్రకటించిన కొత్త టీకా విధానం ప్రకారం.. విదేశాలకు వెళ్లే వారు తొలి టీకా తీసుకున్న 28 రోజుల తరువాత రెండో డోసు తీసుకోవచ్చు. ఇతరులు మాత్రం 84 రోజుల తరువాత మాత్రమే రెండో టీకా డోసుకు అర్హులవుతారు. 

Updated Date - 2021-06-15T05:16:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising