ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీలో 18 నుంచి తెరుచుకోనున్న స్కూళ్లు

ABN, First Publish Date - 2021-01-13T21:09:26+05:30

దేశ రాజధాని ఢిల్లీలో 10, 12 తరగతుల విద్యార్థులకు ఈనెల 18 నుంచి స్కూళ్లు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 10, 12 తరగతుల విద్యార్థులకు ఈనెల 18 నుంచి స్కూళ్లు తెరుచుకోనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. రాబోయే బోర్డు పరీక్షలు, ప్రీబోర్డ్ ఎగ్జామినేషన్లు, ప్రాక్టికల్ వర్క్‌ సన్నాహకాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. సుమారు తొమ్మిది నెలల తర్వాత క్లాస్ 10, 12 తరగతుల విద్యార్థులు తిరిగి క్యాంపస్ ముఖం పడుతున్నారు. ఈనెల 18 నుంచి స్కూళ్లు తెరుచుకుంటాయని ప్రకటించిన ప్రభుత్వం, పేరెంట్ల అనుమతి, అవసరమైన కోవిడ్-19 జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే విద్యార్థులను కాలేజీలకు పిలవాలని ఆయా స్కూళ్లను కోరింది. బలవంతమేమీ ఉండరాదని తెలిపింది. విద్యార్థుల హాజరుపై స్కూళ్లు రికార్డులు మెయింటన్ చేయాలని, అయితే అటెండెన్స్ ఐచ్ఛికమేనని తెలిపింది. కంటైన్మెంట్ జోన్స్ వెలుపల ఉన్న స్కూళ్లను మాత్రమే తెరిచేందుకు అనుమతిస్తున్నామని, ఆ జోన్లలో ఉండే విద్యార్థులు, టీచర్లు, సిబ్బందికి అనుమతి లేదని పేర్కొంది. సమావేశాలు, ఫిజికల్ ఔట్‌డోర్ కార్యక్రమాలు జరపారదని స్కూళ్లను కోరింది. పుస్కకాలు, కాపీలు, స్టేషనరీ వస్తువులు షేర్ చేసుకోకుండా పిల్లలకు సూచనలు ఇవ్వాలని ప్రిన్సిపాళ్లను కోరింది.

Updated Date - 2021-01-13T21:09:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising