ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎర్రకోట ఘటనలపై కేంద్రం సీరియస్

ABN, First Publish Date - 2021-01-27T20:05:51+05:30

దేశరాజధానిలో జరిగిన విధ్వంస ఘటనలపై కేంద్రం సీరియస్ అయ్యింది. ఈ ఘటనలను కేంద్ర హోంశాఖ బుధవారం రివ్యూ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: దేశరాజధానిలో జరిగిన విధ్వంస ఘటనలపై కేంద్రం సీరియస్ అయ్యింది. ఈ ఘటనలను కేంద్ర హోంశాఖ బుధవారం రివ్యూ చేసింది.  ఎర్రకోటపై ఇతర జెండాలు ఎగురవేసిన ఘటనపై హోంశాఖ దృష్టి పెట్టింది. జెండాలు ఎగురవేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హోంశాఖ ఆదేశించింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దోషులను గుర్తించాలని పోలీస్‌శాఖకు కేంద్రం సూచించింది. ఐబీ చీఫ్‌తో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. ఇప్పటికే 35 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసిన పోలీసులు, 200 మంది నిందితులను గుర్తించారు. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ కేసు విచారణ చేపట్టింది. 

 


ఇదిలా ఉంటే,  ఫిబ్రవరి 1న రైతు సంఘాలు పార్లమెంట్‌ ర్యాలీ తలపెట్టాయి. అయితే, నిన్నటి డిల్లీ ఘటన కారణంగా రైతులు పునరాలోచనలో పడ్డారు. పార్లమెంట్‌ ర్యాలీని వాయిదా వేసుకునే ఆలోచనలో ఉన్నారు. ఎర్రకోట‌ను కేంద్ర మంత్రి ప్రహ్లాద్ ప‌టేల్ సందర్శించారు. రెడ్‌ఫోర్ట్‌లో ధ్వంసమైన భాగాలను ప్రహ్లాద్‌ పటేల్‌ పరిశీలించారు. కోట‌పై జెండాలు పాతే క్రమంలో .. రెడ్‌ఫోర్ట్‌లో కొన్ని చోట్ల గోడలు ధ్వంస‌మైనట్టు గుర్తించారు. 

Updated Date - 2021-01-27T20:05:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising