ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Cybercrimes: బెంగళూరు నెం.1, ఢిల్లీలో తక్కువ

ABN, First Publish Date - 2021-09-16T23:09:03+05:30

అయితే ఎన్‌సీఆర్‌బీ డేటా వెల్లడించిన విషయాల ప్రకారం.. ముంబైలో 2,433 సైబర్ నేరాలు నమోదు అయ్యాయి. ఇక చెన్నైలో 186 సైబర్ నేరాలు నమోదు కాగా, కోల్‌కతాలో 172 సైబర్ నేరాలు నమోదు అయ్యాయి. ఈ మూడు ప్రధాన నగరాలతో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలోని ప్రధాన మెట్రో నగరాలైన ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాలతో పోల్చుకుంటే ఢిల్లీలో అత్యంత తక్కువ సైబర్ నేరాలు నమోదైనట్లు నేషనల్ క్రైం రికార్డ్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) బుధవారం విడుదల చేసిన డేటాలో పేర్కొంది. వాస్తవానికి గతేడాదితో పోల్చుకుంటే దేశ రాజధాని ఢిల్లీలో సైబర్ నేరాలు పెరిగినప్పటికీ దేశంలోని ప్రధాన నగరాలతో పోల్చినప్పుడు చాలా తక్కువ నమోదు అయ్యాయి. 2019లో ఢిల్లీలో 107 సైబర్ నేరాలు నమోదు కాగా, 2020లో 166 నమోదు అయ్యాయి. మొత్తంగా చూసుకుంటే బెంగళూరులో అత్యధికంగా 8,892 సైబర్ నేరాలు నమోదు అయ్యాయి. అతి తక్కువగా కొయంబత్తూర్‌లో కేవలం నాలుగు సైబర్ నేరాలు మాత్రమో నమోదు అయ్యాయి.


అయితే ఎన్‌సీఆర్‌బీ డేటా వెల్లడించిన విషయాల ప్రకారం.. ముంబైలో 2,433 సైబర్ నేరాలు నమోదు అయ్యాయి. ఇక చెన్నైలో 186 సైబర్ నేరాలు నమోదు కాగా, కోల్‌కతాలో 172 సైబర్ నేరాలు నమోదు అయ్యాయి. ఈ మూడు ప్రధాన నగరాలతో పోల్చుకుంటే ఢిల్లీలో తక్కువ సైబర్ నేరాలు నమోదు అయ్యాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎన్‌సీఆర్‌బీ ప్రకారం 20 లక్షల జనాభా దాటిన నగరాల జాబితాలో దేశంలోని 19 నగరాల్లో సైబర్ నేరాలు నమోదు అయ్యాయి. అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, కొయంబత్తూర్, ఢిల్లీ, ఘజియాబాద్, హైదరాబాద్, ఇండోర్, జైపూర్, కాన్పూర్, కొచ్చి, కోల్‌కతా, కోజికోడ్, లఖ్‌నవూ, ముంబై, నాగ్‌పూర్, పాట్నా, పూణె, సూరత్ నగరాలు ఈ జాబితాలో ఉన్నాయి.

Updated Date - 2021-09-16T23:09:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising