ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీలో 70 ఏళ్ల కనిష్ఠానికి పడిపోయిన పగటి ఉష్ణోగ్రత

ABN, First Publish Date - 2021-05-20T22:53:42+05:30

దేశ రాజధాని ఢిల్లీలో నిన్న 70 ఏళ్ల నాటి ఉష్ణోగ్రత రికార్డులు బద్దలయ్యాయి. తౌక్తే తుపాను కారణంగా నిన్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నిన్న 70 ఏళ్ల నాటి ఉష్ణోగ్రత రికార్డులు బద్దలయ్యాయి. తౌక్తే తుపాను కారణంగా నిన్న నగరంలో ఆగకుండా వర్షం కురిసింది. ఫలితంగా గరిష్ఠ ఉష్ణోగ్రత 23.8 డిగ్రీలకు పడిపోయింది. సాధారణం కంటే ఇది 16 డిగ్రీలు తక్కువ. కనిష్ఠ ఉష్ణోగ్రత 21.4 డిగ్రీలుగా నమోదైంది. సాధారణం కంటే ఇది 5 డిగ్రీలు తక్కువ. 1951 తర్వాత ఢిల్లీలో మే నెలలో ఇంత తక్కువ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే తొలిసారని భారత వాతావరణ శాఖ పేర్కొంది.  


సఫ్దర్‌జంగ్‌లో నిన్న గరిష్ఠంగా 23.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయిందని, 1951 తర్వాత గరిష్ఠ ఉష్ణోగ్రత ఇంత తక్కువగా నమోదు కావడం ఇదే తొలిసారని ఐఎండీ హెడ్ కుల్దీప్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ మధ్యలో 13 మే 1982లో 24.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు వివరించారు. ఇక, వర్షపాతం విషయంలోనూ ఢిల్లీ రికార్డులకెక్కింది. నిన్న రాత్రి 8.30 వరకు 60 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. మే నెలలో ఒక రోజు ఈ స్థాయిలో వర్షం కురవడం 35 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. 

Updated Date - 2021-05-20T22:53:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising