ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delhi: పిల్లల్ని వణికిస్తున్న వైరల్ జ్వరాలు

ABN, First Publish Date - 2021-09-08T13:08:49+05:30

దేశ రాజధాని నగరమైన ఢిల్లీని వైరల్ జ్వరాలు వణికిస్తున్నాయి....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరమైన ఢిల్లీని వైరల్ జ్వరాలు వణికిస్తున్నాయి. ఢిల్లీ, నోయిడాలలో పిల్లల్లో వైరల్ ఫీవర్ కేసులు పెరుగుతున్నాయని వైద్యులు చెప్పారు.వైరల్ జ్వరాలతో రోజుకు 30 మంది పిల్లలు ఆసుపత్రులకు ఓపీడీలో వస్తున్నారని ఓ వైద్యుడు చెప్పారు.రోగుల్లో 50 శాతం మంది పిల్లలకు వైరల్ జ్వరాలు సోకాయని వైద్యులు వివరించారు.దీనికి తోడు ప్రతీరోజు 7 డెంగీ కేసులు కూడా నమోదు అవుతున్నాయని డాక్టర్ జ్యోత్స్న మదన్ చెప్పారు. పిల్లలు వైరల్ జ్వరాలతోపాటు జలుబు, దగ్గు లక్షణాలతో ఆసుపత్రులకు వస్తున్నారని మధుకర్ రెయిన్‌బో చిల్డ్రన్ హాస్పిటల్ జనరల్ పీడియాట్రిక్స్ డైరెక్టర్ డాక్టర్ నితిన్ వర్మ చెప్పారు. 


ఉత్తర ప్రదేశ్‌లో స్క్రబ్ టైఫస్ జ్వరాలతో 40 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు.ఇటీవల కేంద్రవైద్యనిపుణుల టీమ్ ఫిరోజాబాద్ జిల్లాలో పర్యటించి డెంగీ కారణంగా అత్యధిక కేసులు నమోదయ్యాయని, కొందరికి స్క్రబ్ టైఫస్, లెప్టోస్పిరోసిస్ జ్వరాలు సోకాయని తేల్చారు. రాజధాని నగరంలో పిల్లలు జ్వరాల బారినపడుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2021-09-08T13:08:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising