ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రపంచ top 10 polluted citiesలలో 3 భారత నగరాలు

ABN, First Publish Date - 2021-11-13T16:23:27+05:30

ప్రపంచంలోని టాప్ టెన్ వాయు కాలుష్య నగరాల జాబితాలో భారతదేశంలోని మూడు నగరాలు చేరాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ప్రపంచంలోని టాప్ టెన్ వాయు కాలుష్య నగరాల జాబితాలో భారతదేశంలోని మూడు నగరాలు చేరాయి. శనివారం దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వాయు కాలుష్యం గణనీయంగా పెరిగింది.శనివారం ఢిల్లీలో గాలి నాణ్యత 556 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వద్ద (ఏక్యూఐ) నమోదైంది. నోయిడాలో 405 ఏక్యూఐ, ఘజియాబాద్ లో 427ఏక్యూఐ వద్ద ఉంది.ప్రపంచంలోని మొదటి 10 అత్యంత కలుషిత నగరాల్లో మూడు భారతీయ నగరాలు ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. నవంబరు 13వతేదీన ఉదయం ప్రపంచంలోనే అత్యధికంగా వాయు కాలుష్యం ఢిల్లీలో నమోదైంది. 


వాయుకాలుష్యంలో ఢిల్లీ తర్వాత స్థానం పాకిస్థాన్ దేశంలోని లాహోర్ రెండో స్థానంలో నిలిచింది. చైనా దేశంలోని చెంగ్డు నగరంలో వాయుకాలుష్యం 176 ఏక్యూఐగా నమోదైంది. దేశ ఆర్థిక రాజధాని నగరమైన ముంబై వాయుకాలుష్యంలో ప్రపంచంలోనే నాల్గవస్థానంలో ఉంది. ముంబైలో శనివారం 169 ఏక్యూఐల కాలుష్యం నమోదైంది. కోల్‌కతా నగరం కూడా కాలుష్యంలో టాప్ 7స్థానం పొందింది.మంగోలియా దేశంలోని ఉలాన్ బాతర్,పాకిస్థాన్ దేశంలోని కరాచీ, బల్గేరియాలోని  సోఫియా, బంగ్లాదేశ్ లోని ఢాకా, సెర్బియా దేశంలోని బెల్ గ్రేడ్ నగరాలు టాప్ టెన్ ప్రపంచ వాయు కాలుష్య నగరాలుగా మారాయి. 


Updated Date - 2021-11-13T16:23:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising