ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాబా రామ్‌దేవ్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసు

ABN, First Publish Date - 2021-07-30T20:11:14+05:30

యోగా గురువు బాబా రామ్‌దేవ్‌కు ఢిల్లీ హైకోర్టు శుక్రవారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : యోగా గురువు బాబా రామ్‌దేవ్‌కు ఢిల్లీ హైకోర్టు శుక్రవారం నోటీసు ఇచ్చింది. కోవిడ్-19కు చికిత్సలో అల్లోపతి విధానాన్ని విమర్శించినందుకు ఆయనపై దాఖలైన పిటిషన్‌పై ఈ చర్య తీసుకుంది. అల్లోపతితోపాటు, అల్లోపతి వైద్యులపై తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజే్స్తున్నారని ఆయనపై అనేక కేసులు నమోదయ్యాయి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పరువు నష్టం కేసు దాఖలు చేసింది. దీనిపై తదుపరి విచారణ ఆగస్టు 10న జరుగుతుంది. 


రామ్‌దేవ్ బాబా చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అప్పట్లో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న డాక్టర్ హర్షవర్ధన్ జోక్యంతో బాబా రామ్‌దేవ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ వివిధ డాక్టర్స్ అసోసియేషన్లు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశాయి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆయనకు పంపిన లీగల్ నోటీసులో తన వ్యాఖ్యలను 15 రోజుల్లోగా ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని, లేదంటే రూ.1,000 కోట్లకు పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించింది. రామ్‌దేవ్ బాబాపై పాట్నా, రాయ్‌పూర్‌లలో కూడా ఫిర్యాదులు దాఖలయ్యాయి. 


Updated Date - 2021-07-30T20:11:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising