ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Smoking కంటే ప్రమాదకరంగా ఢిల్లీ

ABN, First Publish Date - 2021-11-07T02:37:15+05:30

సిగరెట్ పొగ కంటే ఢిల్లీలో పీల్చే గాలి ప్రమాదకరంగా మారుతోందని, వాతావరణ కాలుష్య తీవ్రతతో ఢిల్లీవాసుల జీవితకాలం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: సిగరెట్ పొగ కంటే ఢిల్లీలో పీల్చే గాలి ప్రమాదకరంగా మారుతోందని, వాతావరణ కాలుష్య తీవ్రతతో ఢిల్లీవాసుల జీవితకాలం గణనీయంగా తగ్గుతోందని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా అన్నారు. పలు అధ్యయనాలు కూడా వాయికాలుష్యంతో ఢిల్లీవాసుల ఆయుఃప్రమాణం తగ్గుతున్నట్టు వెల్లడిస్తున్నాయని ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. కాలుష్యం అనేది మనుషుల జీవితకాలాన్ని తగ్గిస్తుందనడంలో సందేహం లేదని, నిజానికి ఢిల్లీవాసుల ఊపిరితిత్తులు పొగబారుతున్నాయని అన్నారు.


బాణసంచా వల్ల వాతావరణం పెద్దగా కలుషితం కాదనే అభిప్రాయాలపై అడిగిన ప్రశ్నకు గులేరియా సమాధానమిస్తూ, ఇండో గంగా మైదానాల్లో  కాలుష్యం చాలా హెచ్చుగా ఉంటుందని, దీపావళికి బాణసంచా ప్రభావం కూడా గణనీయంగానే ఉంటుందని చెప్పారు. పండుగల సమయాల్లో వాహనాల రద్దీ వంటివి కూడా కాలుష్యానికి దారితీస్తాయని అన్నారు.


కాలుష్య ప్రాంతాల్లో కోవిడ్ పెరిగే అవకాశం..

కాలుష్యం బారిన పడిన ప్రాంతాల్లో కోవిడ్ కేసులు పెరిగే అవకాశాలు ఉంటాయని గులేరియా హెచ్చరించారు. పేషెంట్ల ఊపిరితిత్తుల్లో స్వెల్లింగ్ పెరుగుతుందని చెప్పారు. దీపావళి అనంతరం కోవిడ్ కేసులు పెరిగే అవకాశాలతో పాటు, పొరుగు సిటీలపై కూడా ఆ ప్రభావం పడుతుందని ఆయన అన్నారు.


కాగా, 2017 నుంచి చూస్తే దీపావళి తర్వాత ఎయిర్ క్వాలిటీ ఈసారి దయనీయంగా ఉందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (సీపీసీబీ) పేర్కొంది. బాణసంచా నుంచి వచ్చే విషవాయువులతో పాటు పంట వ్యర్థాలను తగులబెట్టడం వల్ల ఎయిర్ క్వాలిటీ గత 24 గంటల్లో బాగా దిగజారినట్టు సీపీసీబీ పేర్కొంది.

Updated Date - 2021-11-07T02:37:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising