ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆసుప‌త్రి నుంచి 23 మంది క‌రోనా బాధితులు ప‌రార్‌!

ABN, First Publish Date - 2021-05-09T18:07:46+05:30

దేశ‌రాజ‌ధాని ఢిల్లీలోని బ‌డా హిందూరావ్ ఆసుప‌త్రి నుంచి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశ‌రాజ‌ధాని ఢిల్లీలోని బ‌డా హిందూరావ్ ఆసుప‌త్రి నుంచి 23 మంది కోవిడ్ బాధితులు ప‌రార‌వ‌డంతో ఆసుప‌త్రి వ‌ర్గాల్లో క‌ల‌క‌లం చెల‌రేగింది. ఈ ఉదంతంపై ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఆందోళన వ్యక్తం చేశారు. బాడా హిందూరావు ఆసుపత్రిలో కరోనా బాధితుల కోసం 250 పడకలు కేటాయించారు. ఇవ‌న్నీ క‌రోనా బాధితుల‌తో నిండిపోయాయి. 


ఏప్రిల్ 19 నుంచి మే 6 మధ్యకాలంలో ఆసుప‌త్రి నుంచి 23 మంది కరోనా బాధితులు ఆసుపత్రిలో సమాచారం ఇవ్వకుండానే ప‌రార‌య్యారు. ఢిల్లీలోని ప‌లు ప్రభుత్వ ఆసుపత్రుల‌లో ఈ త‌ర‌హా ఉదంతాలు చోటుచేసుకుంటున్నాయి. కాగా రాజధాని ఢిల్లీలో క‌రోనా కేసులు కాస్త తగ్గుముఖం ప‌ట్టాయి. శనివారం కొత్త‌గా 17,364 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఇదే స‌మ‌యంలో వైర‌స్ కార‌ణంగా  332 మంది మృత్యువాత ప‌డ్డారు. 22 రోజుల తర్వాత ఢిల్లీలో 18 వేల‌ కంటే తక్కువగా క‌రోనా కేసులు నమోదయ్యాయి. గత కొద్ది రోజులుగా రోజువారీ క‌రోనా కేసుల సంఖ్య త‌గ్గుతూవ‌స్తోంది.

Updated Date - 2021-05-09T18:07:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising