ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చైనాపై రాజ్‌నాథ్ సింగ్ ఘాటు వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2021-11-21T20:47:42+05:30

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చైనాపై తీవ్రంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చైనాపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. సంకుచిత, పక్షపాత ప్రయోజనాల కోసం పెత్తనం చలాయించే ధోరణితో వ్యవహరిస్తోందని, బాధ్యతా రహితంగా ప్రవర్తిస్తోందని దుయ్యబట్టారు. సముద్ర న్యాయంపై ఐక్య రాజ్య సమితి ఒప్పందం (యూఎన్‌సీఎల్ఓఎస్)కు తప్పుడు నిర్వచనం చెప్తోందని మండిపడ్డారు. ఐఎన్ఎస్ విశాఖపట్నం యుద్ధ నౌకను జల ప్రవేశం చేయించిన అనంతరం ఆయన మాట్లాడారు. 


కొన్ని బాధ్యతా రహిత దేశాలు తమ సంకుచిత, పక్షపాత ప్రయోజనాలతో పెత్తనం చలాయించే ధోరణులతో యూఎన్‌సీఎల్ఓఎస్‌కు తప్పుడు నిర్వచనాలు చెప్తున్నాయన్నారు. ఈ దేశాలు నిరంకుశ నిర్వచనాలు చెప్తూ దీనిని పదే పదే బలహీనపరుస్తుండటం ఆందోళనకరమని చెప్పారు. 


ఐఎన్ఎస్ విశాఖపట్నం యుద్ధ నౌకను దేశీయంగానే తయారు చేశారు. ఇది స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ యుద్ధనౌక. దీనిలో క్షిపణులు, యాంటీ సబ్‌మెరైన్ రాకెట్లు ఉంటాయి. బీభత్సం సృష్టించే ఆయుధాలు, సెన్సర్లు, సూపర్‌సానిక్ సర్ఫేస్ టు సర్ఫేస్, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్, మీడియం, షార్ట్ రేంజ్ గన్స్ వంటివి ఉన్నాయి. ఈ నౌకను ప్రాజెక్టు 15బీలో భాగంగా మజగావ్ షిప్ బిల్డర్స్ దేశీయంగా నిర్మించింది. 


Updated Date - 2021-11-21T20:47:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising