ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దీపావళి ఆనందానికి దూరంగా Amma mini-clinic డాక్టర్లు

ABN, First Publish Date - 2021-11-01T21:39:52+05:30

కరోనా సెకెండ్‌వేవ్ సమయంలో ఫ్రంట్‌లైన్ వారియర్లుగా సేవలందించిన అమ్మ మిని-క్లినిక్ డాక్టర్లు ఈసారి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: కరోనా సెకెండ్‌వేవ్ సమయంలో ఫ్రంట్‌లైన్ వారియర్లుగా సేవలందించిన అమ్మ మిని-క్లినిక్ డాక్టర్లు ఈసారి దీపావళి సంబరాలకు నోచుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఏడు జిల్లాల్లోని డాక్టర్లకు రెండు నెలలుగా జీతాలు లేవు. మరో 10 జిల్లాల్లో డాక్టర్లకు సెప్టెంబర్ నుంచి వేతనాలు అందలేదు. సెకెండ్ వేవ్ సమయంలో రూ.60,000 వేతనంతో వీరిని రిక్రూట్ చేశారు.


మదురైలోని మినీ క్లినిక్ డాక్టర్ ఆర్.కార్తీక్ దీనిపై మాట్లాడుతూ, ఈ దీపావళి ఏమాత్రం ఆశాజనకంగా లేదని చెప్పారు. కుటుంబ ఖర్చుల కోసం చేతిలో చిల్లిగవ్వ కూడా లేదని చెప్పారు. సెకెండ్ వేవ్ సమయంలో ప్రాణాలకు కూడా తెగించి సేవలందించామని, అయితే వాళ్లు (ప్రభుత్వం) మాత్రం అమానవీయంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోయంబత్తూరు, వెల్లూరు, తిరుపూరు, మదురై, కరూర్, తిరువారూరు, తంజావూరు జిల్లాల్లో డాక్టర్లకు గత రెండు నెలలుగా జీతాలు ఇవ్వలేదు. ప్రతిరోజూ తాము 40 కిలోమీటర్లు పర్యటించే వాళ్లమని, తినడానికి, ప్రయాణానికి రోజుకు రూ.400 చొప్పున తమకు ఖర్చు అయ్యేదని కార్తీక్ తెలిపారు. తంజావూర్ క్లినిక్‌లో పనిచేసిన డాక్టర్ ఎ.జాన్ మరింత ఆవేదన వ్యక్తం చేశారు. దీపావళి పండుగ కూడా సంతోషంగా జరుపుకొనే పరిస్థితిలో తాము లేమన్నారు. మెగా వ్యాక్సినేషన్ క్యాంపులను తాము విజయవంతంగా నిర్వహించామని, ప్రస్తుతం తాము మానసికగా కృంగిపోతున్నామని, పరిస్థితి ఎంతకాలం ఇలా ఉంటుందో తెలియదని వాపోయారు.


త్వరలోనే పూర్తి పేమెంట్: అధికారులు

కాగా, అమ్మ మిని-క్లినిక్ వైద్యులకు జీతాల చెల్లింపులపై అడిగిన ప్రశ్నకు అధికార వర్గాలు స్పందించాయి. 16 జిల్లాల్లో వేతనాల అంశం పరిష్కరించామని, మిగతా జిల్లాల్లోనూ త్వరలోనే చెల్లింపులు జరుపుతామని చెప్పారు. నిధుల కొరత ఉన్నందున సాధ్యమైనంత త్వరలో చెల్లింపులు చేస్తామని, ప్రతి ఒక్కరికీ బకాయిలు చెల్లిస్తామని తెలిపారు. మరోవైపు, మినీ క్లినిక్ ప్రోగ్రాం భవిష్యత్తు ఏమిటనేది కూడా ప్రస్తుతం వైద్యులను వేధిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ క్లినిక్‌లు కొససాగిస్తుందా లేదా అనే అంశం వారిమధ్య ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది.

Updated Date - 2021-11-01T21:39:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising