ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డిసెంబరు నాటికి అందరికీ వ్యాక్సిన్‌

ABN, First Publish Date - 2021-06-22T17:29:11+05:30

డిసెంబరు ఆఖరు నాటికి రాష్ట్రంలోని అందరికీ వ్యాక్సిన్‌ వేయాలని లక్ష్యం గా పనిచేస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్‌ తెలిపారు. సోమవారం శివాజీనగర్‌లోని అటల్‌బిహారి వాజ్‌పే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

               - వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్‌ 


బెంగళూరు: డిసెంబరు ఆఖరు నాటికి రాష్ట్రంలోని అందరికీ వ్యాక్సిన్‌ వేయాలని లక్ష్యం గా పనిచేస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్‌ తెలిపారు. సోమవారం శివాజీనగర్‌లోని అటల్‌బిహారి వాజ్‌పేయ్‌ మెడికల్‌ కళాశాలలో వ్యాక్సిన్‌ మహా అభియానకు సీఎం యడియూరప్పతో కలసి ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా డాక్టర్‌ సుధాకర్‌ మాట్లాడుతూ ఒకేరోజున 7 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేయదలిచామని, 18-45 ఏళ్లలోపు వారికి రెండోడోసు వారికి వ్యాక్సిన్‌ అందుబాటులో ఉందన్నారు. డిసెంబరు చివరకు రాష్ట్రంలోని అందరికీ వ్యాక్సిన్‌ సాధ్యం చేస్తామన్నారు. ప్రస్తుతానికి 1.86 కోట్లమందికి వ్యాక్సిన్‌ వేశామన్నారు. 15 లక్షలకుపైగా కొవిషీల్డ్‌, 6 నుంచి 7 లక్షల కొవాగ్జిన్‌ సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 13 వేల కేంద్రాల ద్వారా వ్యాక్సిన్‌ పంపిణీ సాగుతుందన్నారు. ప్రతి కేంద్రంలోనూ రోజు 70-80 మందికి వ్యాక్సిన్‌ ఇవ్వదలిచామన్నారు. ప్రజలు వ్యాక్సిన్‌ వేయించుకోవాలని సూచించారు. స్పుత్ని క్‌ వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు అనుమతి ఉందని, ఇంకా అవసరమైనంత రాలేదన్నారు. ఆరంభంలో వ్యాక్సిన్‌పట్ల కొందరు చేసిన దుష్ప్రచారంతో జాప్యమైందని, ప్రస్తుతం వ్యాక్సినేషన్‌ ఆశాజనకంగా సాగుతోందన్నారు. కొవిడ్‌కు సంబంధించి సమగ్ర వివరాలు అందించడంలో కర్ణాటక మోడల్‌గా నిలిచిందని కేంద్రప్రభుత్వమే ప్రశంసించిందన్నారు. ఇది వైద్య ఆరోగ్యశాఖతోపాటు పలుశాఖల సమన్వయంతో సాధ్యమైందన్నారు. ఏ సమాచారం కూడా రహస్యం లేదని, అంతా పారదర్శకమే అన్నారు. బ్లాక్‌ఫంగ్‌సకు చికిత్సలు అందిస్తున్నామన్నారు. కొవిడ్‌ నియంత్రణకు సంబంధించి ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు మారుతుంటాయని వాటిని అనుసరించుకుని ప్రజలు సహకరించాలన్నారు. 

Updated Date - 2021-06-22T17:29:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising