ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Philippines‌లో రాయ్ తుపాన్: 208కి చేరిన మృతుల సంఖ్య

ABN, First Publish Date - 2021-12-20T12:36:11+05:30

ఫిలిప్పీన్స్ దేశాన్ని అతలాకుతలం చేసిన రాయ్ తుపాన్(టైపూన్) వల్ల మృతుల సంఖ్య 208కి పెరిగింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

239 మందికి గాయాలు, మరో 52 మంది గల్లంతు

మనీలా: ఫిలిప్పీన్స్ దేశాన్ని అతలాకుతలం చేసిన రాయ్ తుపాన్(టైపూన్) వల్ల మృతుల సంఖ్య 208కి పెరిగింది.టైఫూన్ రాయ్ ఫిలిప్పీన్స్ ద్వీపసమూహంలోని దక్షిణ, మధ్య ప్రాంతాలను ధ్వంసం చేసింది. ఈ తుపాన్ విపత్తు వల్ల 239 మంది గాయపడ్డారు. మరో 52 మంది గల్లంతు అయ్యారని ఫిలిప్పీన్స్ పోలీసులు చెప్పారు.సూపర్ టైఫూన్‌గా రాయ్ గురువారం దేశంలోకి దూసుకుపోవడంతో 3,00,000 మందికి పైగా ప్రజలు తమ ఇళ్లు,బీచ్ ఫ్రంట్ రిసార్ట్‌లను వదిలి పారిపోయారు.ఫిలిప్పీన్ రెడ్‌క్రాస్ తీర ప్రాంతాలు మారణహోమాన్ని తలపించాయి. 


తుపాన్ వల్ల ఇళ్లు, ఆసుపత్రులు, పాఠశాలలు, కమ్యూనిటీహాళ్లు దెబ్బతిన్నాయని రెడక్రాస్ ఛైర్మన్ రిచర్డ్ గోర్డాన్ చెప్పారు. తుపాన్ బీభత్సం వల్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి.గంటకు 195 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ దేశంలోకి దూసుకొచ్చిన తుపాను తీవ్రత వల్ల సియార్‌గావ్, దినాగట్, మిండనావో దీవుల్లో భారీ విధ్వంసం జరిగింది.వేలాది మంది మిలిటరీ, పోలీసు, కోస్ట్ గార్డ్, అగ్నిమాపక సిబ్బంది సహాయ పునరావాస పనులు చేపట్టారు.


Updated Date - 2021-12-20T12:36:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising