ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ నెల 31 వరకు సోషల్ గేదరింగ్స్‌పై నిషేధం

ABN, First Publish Date - 2021-12-16T22:55:49+05:30

కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి నిరోధక ఆంక్షలను ఈ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి నిరోధక ఆంక్షలను ఈ నెల 31 రాత్రి వరకు పొడిగిస్తున్నట్లు ఢిల్లీ విపత్తు నిర్వహణ అథారిటీ (డీడీఎంఏ) ప్రకటించింది. సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాలపై నిషేధం విధించినట్లు తెలిపింది. బార్లు, రెస్టారెంట్లు 50 శాతం సీటింగ్ కెపాసిటీతో మాత్రమే పని చేయాలని తెలిపింది. దీని ప్రభావం క్రిస్టమస్, నూతన సంవత్సరం వేడుకలపై పడుతుంది. 


డీడీఎంఏ జారీ చేసిన ఆదేశాల ప్రకారం, ప్రస్తుతం ఢిల్లీలో డిసెంబరు 31-జనవరి 1 మధ్య రాత్రి వరకు ఆంక్షలు కొనసాగుతాయి. కోవిడ్-19 పరిస్థితి మెరుగుపడుతుండటంతో చాలా కార్యకలాపాలకు అనుమతి ఇచ్చినప్పటికీ, సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన, అటువంటి ఇతర కార్యకలాపాలపై నిషేధం కొనసాగుతుంది. 


డీడీఎంఏ నిర్ణయంపై రెస్టారెంట్లు, బార్ల యజమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. కోవిడ్ మహమ్మారి వల్ల వచ్చిన నష్టాల నుంచి బయటపడతామని తాము ఎంతో ఆశించామని, ఈ ఆంక్షలు తమను ఆవేదనకు గురి చేస్తున్నాయని చెప్పారు. 


Updated Date - 2021-12-16T22:55:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising