ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిల్లలపై కోవాగ్జిన్ ప్రయోగం.. డీసీజీఐ గ్రీన్‌సిగ్నల్!

ABN, First Publish Date - 2021-05-13T17:20:08+05:30

చిన్న పిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చే దిశగా కీలక ముందడుగు పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిన్న పిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చే దిశగా కీలక ముందడుగు పడింది. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన `కోవాగ్జిన్` టీకా 2-18 ఏళ్ల మధ్య వయసు గల వారిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకునేందుకు క్లినికల్ ప్రయోగాలు జరిపేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి మంజూరు చేసింది. 2-18 ఏళ్ల మధ్య వయసు గల వారిపై కోవాగ్జిన్ రెండు, మూడు దశల పరీక్షలు ప్రయోగాలు నిర్వహించాలని నిపుణులు కమిటీ చేసిన సిఫారసు మేరకు డీసీజీఐ ఈ నిర్ణయం తీసుకుంది. 


2-18 ఏళ్ల మధ్య వయసు గల 525 మంది వాలంటీర్లపై భారత్ బయోటెక్ ఈ ప్రయోగాలు జరపనుంది. అయితే మూడో దశ ప్రయోగాలు ప్రారంభించడానికి ముందే రెండో దశ క్లినికల్ ట్రయల్స్ భద్రత డేటా, డీఎస్‌ఎంబీ సిఫారసులను సీడీఎస్‌సీవోకు సమర్పించాలని భారత్ బయోటిక్‌కు డీసీజీఐ సూచించింది. ఢిల్లీ ఎయిమ్స్, పట్నా ఎయిమ్స్ సహా దేశవ్యాప్తంగా పలు చోట్ల ఈ ప్రయోగాలు జరగనున్నాయి. వాలంటీర్లకు 28 రోజుల వ్యవధిలో రెండు డోసులను ఇచ్చి ఫలితాలను విశ్లేషించనున్నారు. 

Updated Date - 2021-05-13T17:20:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising