ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రిన్స్ ఫిలిప్ మృతి పట్ల దలైలామా సంతాపం

ABN, First Publish Date - 2021-04-10T23:50:31+05:30

బ్రిటన్ రాణి ఎలిజబెత్‌ భర్త ప్రిన్స్‌ ఫిలిప్ మృతి పట్ల బౌద్ధ గురువు దలైలామా సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధర్మశాల: బ్రిటన్ రాణి ఎలిజబెత్‌ భర్త ప్రిన్స్‌ ఫిలిప్ మృతి పట్ల బౌద్ధ గురువు దలైలామా సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన రాణి ఎలిజబెత్, కుమారుడు ప్రిన్స్ చార్లెస్‌లకు విడివిడిగా సంతాప సందేశాలు రాసి పంపారు. రాణికి రాసిన లేఖలో దలైలామా స్పందిస్తూ.. ‘‘మీ భర్త ప్రిన్స్ ఫిలిప్ మరణవార్త తెలిసి చాలా బాధకలిగింది. ఆయన కోసం ప్రార్థిస్తూ నివాళులు అర్పిస్తున్నాను. ఈ విషాద సమయంలో మీకు, మీ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మేమంతా ఆయనను స్మరించుకుంటున్న వేళ... ఒక అర్థవంతమైన జీవితాన్ని జీవించారని సంతోషంగా చెప్పగలం..’’అని పేర్కొన్నారు. 


అలాగే ప్రిన్స్ చార్లెస్‌కు రాసిన లేఖలో కూడా దలైలామా తన సంతాపం వ్యక్తం చేశారు. ‘‘ఈ విచారకర సమయంలో మీ తల్లి, రాణి ఎలిజబెత్‌కు సంతాపం తెలియజేస్తూ సందేశం పంపాను. మీకు అత్యంత ఆప్తులైన వారిలో.. నేను కూడా ఉన్నానని గుర్తుచేసుకోండి.  మీకు, మీ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను..’’ అని ఆయన పేర్కొన్నారు. ప్రిన్స్ ఫిలిప్ సంపూర్ణమైన, అర్థవంతమైన జీవితాన్ని జీవించారంటూ దలైలామా కొనియాడారు. 

Updated Date - 2021-04-10T23:50:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising