ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాణసంచాపై కలకత్తా హైకోర్టు నిషేధం

ABN, First Publish Date - 2021-10-29T21:39:54+05:30

దీపావళి, ఛాత్ పూజ, ఇతర పండుగల సందర్భంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా : దీపావళి, ఛాత్ పూజ, ఇతర పండుగల సందర్భంగా బాణసంచా అమ్మకాలు, వినియోగంపై కలకత్తా హైకోర్టు శుక్రవారం నిషేధం విధించింది. ఈ ఆదేశాలను ఉల్లంఘించినవారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో వాయు కాలుష్య నిరోధం కోసం ఈ ఆదేశాలు ఇచ్చింది. 


దీపావళి, ఛాత్ పూజ, ఇతర పండుగల సమయాల్లో బాణసంచా అమ్మకాలు, వినియోగాలను నిషేధిస్తున్నట్లు జస్టిస్ సబ్యసాచి భట్టాచార్య, జస్టిస్ అనిరుద్ధ రాయ్ డివిజన్ బెంచ్ ఓ పిటిషన్‌పై విచారణ జరిపి, తీర్పు చెప్పింది. ఈ ఆదేశాలను ఉల్లంఘించినవారి వద్ద నుంచి బాణసంచాను జప్తు చేసి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. 


దీపావళి, కాళీ పూజల సందర్భంగా పరిమిత సమయంలో ‘గ్రీన్’ ఫైర్ క్రాకర్స్‌ను కాల్చుకోవచ్చునని పశ్చిమ బెంగాల్ కాలుష్య నియంత్రణ మండలి ఇటీవల ఓ నోటిఫికేషన్ ఇచ్చింది. హైకోర్టు తీర్పుతో ఈ నోటిఫికేషన్ శూన్యం, రద్దు అయింది. 


Updated Date - 2021-10-29T21:39:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising