ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ దేశంలో రెండేళ్ల చిన్నారులకు కరోనా టీకాలు!

ABN, First Publish Date - 2021-09-07T16:44:21+05:30

ప్రపంచవ్యాప్తంగా కరోనా కట్టడికి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హవానా: ప్రపంచవ్యాప్తంగా కరోనా కట్టడికి టీకాలు వేసే కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. అయితే టీకాలు వేసే విషయంలో క్యూబా మరో ముందడుగు వేసింది. ప్రపంచంలోనే తొలిసారిగా క్యూబాలో రెండేళ్ల చిన్నారులకు కూడా కరోనా టీకాలు వేయడం ప్రారంభించారు. క్యూబాలో స్థానికంగా తయారు చేసిన రెండు రకాల టీకాలను వినియోగిస్తున్నారు. అయితే ఈ టీకాలకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(డబ్ల్యు‌హెచ్‌ఓ) గుర్తింపునివ్వలేదు. మీడియాకు అందిన వివరాల ప్రకారం క్యూబాలో... అబ్దలా, సోబర్నా అనే రెండు రకాల టీకాలను తయారు చేశారు. పిల్లలపై ఈ వ్యాక్సీన్ల క్లీనికల్ ట్రయల్స్ పూర్తయ్యింది. దీంతో దేశంలోని చిన్నారులకు కరోనా వ్యాక్సీన్ ఇవ్వడం ప్రారంభించారు. ముందుగా 12 ఏళ్లు, అంతకుమించిన వయసుగల వారికి టీకాలు ఇస్తున్నారు. 


Updated Date - 2021-09-07T16:44:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising