ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెల్లింపులకు క్రిప్టోకరెన్సీ మంచి మాధ్యమం కాదు: బ్రిటన్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్

ABN, First Publish Date - 2021-06-15T05:04:11+05:30

చెల్లింపుల మాధ్యమంగా వినియోగించేందుకు క్రిప్టోకరెన్సీలు మంచివి కావని బ్రిటన్ సెంట్రల్ బ్యాంకు గవర్నర్ ఆండ్రూ బేయిలీ అభిప్రాయపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: చెల్లింపుల మాధ్యమంగా వినియోగించేందుకు క్రిప్టోకరెన్సీలు మంచివి కావని బ్రిటన్ సెంట్రల్ బ్యాంకు గవర్నర్ ఆండ్రూ బేయిలీ అభిప్రాయపడ్డారు. ‘‘వాటి విలువ నిరంతరం ఎగుడుదిగుడులకు లోనవుతుంటుంది. వాటి విలువ మరే ఇతర వాస్తవ ఆస్తులపై ఆధారపడి లేదు. కాబట్టి..మీరు ఈ కరెన్సీని సొంతం చేసుకుంటే భవిష్యత్తులో నష్ట పోవచ్చు’’ అని కామెంట్ చేశారు. ఇటీవల కాలంలో క్రిప్టోకరెన్సీలకు డిమాండ్ విపరీతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈలాన్ మస్క్‌ లాంటి టెక్ ఆంత్రప్రెన్యూర్ల మద్దతు కారణంగా క్రిప్టోకరెన్సీల విలువ నానాటికీ ఎగబాకుతోంది. అనేక ప్రభుత్వాలు క్రిప్టోకరెన్సీ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నప్పటికీ ప్రవైటు సంస్థలు మాత్రం ఆశావాహధోరణితో క్రిప్టోకరెన్సీ ద్వారా చెల్లింపులు చేపట్టేందుకు సిద్ధమయ్యాయి. ఇక ప్రపంచంలోనే తొలిసారిగా మధ్య అమెరికా దేశం ఎల్‌ శాల్వడార్ తమ సొంత కరెన్సీకి సమానమైన స్థానాన్ని క్రిప్టోకరెన్సీకి కల్పించింది. ఈ డిజిటల్ కరెన్సీతో చెల్లింపులు జరిపేందుకు అనుమతించింది. 

Updated Date - 2021-06-15T05:04:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising