ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్మీ యూనిఫాం ధరించి భార్యతో షికార్లు..చిక్కుల్లో పడ్డ జవాను!

ABN, First Publish Date - 2021-08-23T22:05:35+05:30

ఆర్మీ ఇచ్చిన యూనిఫాం ధరించి భార్యతో షికారుకు బయలుదేరిన ఓ సీఆర్‌పీఎఫ్ జవానుకు అనుకోని చిక్కుల్లో పడ్డాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గువహటీ: ప్రత్యేక భద్రతా దళాల యూనిఫాం ధరించి భార్యతో షికారుకు బయలుదేరిన ఓ సీఆర్‌పీఎఫ్ జవాను అనుకోని చిక్కుల్లో పడ్డాడు. అతడి తీరు అనుమానాస్పదంగా ఉందని భావించిన పోలీసులు.. జవానును, అతడి భార్యను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. జవాను వెంట వచ్చిన మహిళ అతడి భార్యేనని నిర్ధారించుకున్నాక వారిద్దరినీ విడిచిపెట్టారు. అసోంలోని నాగోన్ జిల్లాలో ఆదివారం నాడు ఈ ఘటన జరిగింది. విధుల్లో లేని సమయంలో యూనిఫాం ధరించిన జవాను భార్యతో షికార్లు చేస్తున్న విషయాన్ని ఆర్మీ ఇంటెలిజెన్స్ అధికారులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. కాగా..జవానుపై కేసు ఏమీ పెట్టలేదని పోలీసులు స్పష్టం చేశారు. భార్యను ఇంప్రెస్ చేసేందుకు అప్పుడప్పుడూ అతడు ఇలా యూనిఫాం ధరిస్తాడని తెలిపారు. జవానుకు కౌన్సెలింగ్ ఇచ్చి బెయిల్ బాండ్‌పై విడిచిపెట్టామన్నారు. 


Updated Date - 2021-08-23T22:05:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising