ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ వర్షాకాలంలో తగ్గిన సాగు విస్తీర్ణం

ABN, First Publish Date - 2021-07-17T21:13:35+05:30

ఈ ఏడాది వర్షాకాలం పంటల సాగు విస్తీర్ణం తగ్గడం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఈ ఏడాది వర్షాకాలం పంటల సాగు విస్తీర్ణం తగ్గడం ఆందోళనకరం. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం వరి, పత్తి, సోయాబీన్స్ వంటి వర్షాకాల పంటల సాగు విస్తీర్ణం 12 శాతం తగ్గింది. జూలై 16నాటికి 61.19 మిలియన్ హెక్టార్లలో ఈ పంటలను నాటారు. 


చెరకు సాగు మాత్రం 1.7 శాతం పెరిగింది. ఇప్పటి వరకు 5.37 మిలియన్ హెక్టార్ల భూమిలో చెరకును రైతులు నాటారు. పత్తిని 9.84 మిలియన్ హెక్టార్ల భూమిలో నాటారు. అంటే గత ఏడాది కన్నా ఈ పంట సాగు విస్తీర్ణం 13 శాతం తగ్గింది. వరి గత ఏడాది 17.44 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో సాగయ్యింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 16.19 మిలియన్ హెక్టార్లలో నాట్లు వేశారు. 


పంటల సాగు విస్తీర్ణం తగ్గడానికి ప్రధాన కారణం ఈ ఏడాది వర్షాలు సక్రమంగా కురవకపోవడమే. వర్షాలు సజావుగా కురవకపోవడం వల్ల సాగు, వ్యవసాయ రంగంపై ప్రత్యక్షంగా ప్రభావం పడింది. 


వరిని పెద్ద ఎత్తున ఎగుమతి చేసే దేశాల్లో భారత దేశం ఒకటి. వంట నూనెలను మన దేశం భారీగా దిగుమతి చేసుకుంటోంది. తాజా పరిణామాల నేపథ్యంలో వరి ఎగుమతులు తగ్గబోతుండగా, వంట నూనెల దిగుమతులు పెరుగుతాయి. 







Updated Date - 2021-07-17T21:13:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising