ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మత్స్యకారుల వలకి చిక్కిన అరుదైన క్రోకర్ చేప

ABN, First Publish Date - 2021-05-31T20:06:49+05:30

క్రోకర్ చేప.. దీన్ని ఎప్పుడైనా చూశారా? కనీసం పేరైనా విన్నారా? దాని ధర ఎంత ఉంటుందో ఊహించగలరా? ఇప్పుడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క్రోకర్ చేప.. దీన్ని ఎప్పుడైనా చూశారా? కనీసం పేరైనా విన్నారా? దాని ధర ఎంత ఉంటుందో ఊహించగలరా? ఇప్పుడు ఆ ఖరీదైన చేప గురించి అనేక ఆసక్తికరమైన విషయాలు బయటకొచ్చాయి. పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ సముద్రతీరంలో చేపలు పడుతున్న మత్స్యకారుల వలకు ఈ క్రోకర్ చేప చిక్కింది. దీంతో వాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. బరువు, పొడుగు చెప్పుకోదగినంత లేకపోయినా.. మత్స్యకారులు ఎగిరి గంతేశారు. చేప వలకు చిక్కగానే మత్స్యకారులు మార్కెట్‌కు పరుగులు తీశారు. 26 కిలోల బరువు ఉన్న ఆ క్రోకర్ చేప ధర ఏకంగా రూ. 7లక్షల 80వేలు పలికింది. ఈ చేప దొరగ్గానే తమ ఇంట పండగ మొదలైందని మత్స్యకారులు చెబుతున్నారు.


క్రోకర్ చేప ఎయిర్ బ్లాడర్ వల్లే అది అంత ధర పలుకుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. అది గాలి నింపుకుని ఈదుతుందట. ఈ చేప ఎయిర్ బ్లాడర్ వైద్య చికిత్సలో ఉపయోగపడుతుండడంతో చైనా, జపాన్, యూరప్‌లో దానికి చాలా డిమాండ్ ఉంది. మనుషులకు సర్జరీ చేసినప్పుడు శరీరంలో వేసే కుట్లకోసం క్రోకర్ చేప ఎయిర్ బ్లాడర్‌తో కుట్లు వేసే దారం తయారు చేస్తారని వివరించారు. ముఖ్యంగా గుండె ఆపరేషన్ సమయంలో దాంతో తయారు చేసిన దారంతో కుట్లు వేస్తారని అవి తర్వాత శరీరంతో కలిసిపోతాయని సైంటిస్టులు తెలిపారు.

Updated Date - 2021-05-31T20:06:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising