ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీవెంటే ‘వైరస్‌’.. నిర్లక్ష్యం వీడండి

ABN, First Publish Date - 2021-08-01T12:52:03+05:30

రాష్ట్రంలో కేసుల సంఖ్య తగ్గుతుండడంతో కరోనా లేదనే భావనలో ప్రజలు వుండరాదని ఆరోగ్యశాఖ కార్యదర్శి డా.జె.రాధాకృష్ణన్‌ హెచ్చరించారు. నగరంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

             - ప్రజలకు ఆరోగ్యశాఖ హెచ్చరిక


పెరంబూర్‌(చెన్నై): రాష్ట్రంలో కేసుల సంఖ్య తగ్గుతుండడంతో కరోనా లేదనే  భావనలో ప్రజలు వుండరాదని ఆరోగ్యశాఖ కార్యదర్శి డా.జె.రాధాకృష్ణన్‌ హెచ్చరించారు. నగరంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కరోనా మూడవ అల వ్యాప్తిపై స్పష్టమైన సంకేతాలు లేకపోయినా, కేంద్ర ప్రభుత్వ, వైద్యనిఫుణుల సూచనలతో రాష్ట్రంలో మూడవ అలను ఎదుర్కొనేలా ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్రంలో ఏఏ ప్రాంతాల్లో కరోనా అధికంగా సోకిందో, ఆయా ప్రాంతాల్లో ఎలాంటి వైరస్‌ వ్యాపించిందనే విషయమై జన్యుపరీక్షలు చేపట్టగా, గత ఏప్రిల్‌, మే, జూన్‌, జూలై మాసాల్లో నగరంలో నమోదైన కేసు ల్లో 90 శాతం ‘డెల్టా’ వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయిందన్నారు. ప్రస్తుతం జిల్లాల వారీగా వ్యాధి నిరోధక శక్తి పెంపు పరిగణలోకి తీసుకొని కరోనా టీకాలు అందజేస్తున్నామని తెలిపారు. మూడవ అలను దృష్టిలో ఉంచుకొని ఆక్సిజన్‌ పడకలు, వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్‌లను సిద్ధం చేశామన్నారు. ప్రస్తుతం రాష్ట్రానికి 650 కేఎల్‌ ఆక్సిజన్‌ కేటాయించగా, ప్రస్తుతం ఒక రోజుకు 150 కేఎల్‌ ఆక్సిజన్‌ మాత్రమే అవసరమవుతోందని అన్నారు. మూడో అల పిల్లలపై ప్రభావం చూపుతుందనే హెచ్చరికలతో పడకల్లో 25 శాతం కేటాయించడంతో పాటు అత్యవసర చికిత్సా కేంద్రాలు సిద్ధం చేశామన్నారు.

Updated Date - 2021-08-01T12:52:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising