ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెడికల్ షాపుల్లో కరోనా టీకా..? క్లారిటీ ఇచ్చిన కేంద్రం!

ABN, First Publish Date - 2021-04-22T00:03:11+05:30

మే 1 నుంచి టీకా తయారీదారులు కరోనా వ్యాక్సిన్లను బహిరంగ మార్కెట్లో విక్రయించవచ్చని కేంద్రం ఇటీవల ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రజల్లో అనేక సందేహాలు వ్యక్తమవడంతో కేంద్రం వీటిపై తాజాగా క్లారిటీ ఇచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: మే 1 నుంచి టీకా తయారీదారులు కరోనా వ్యాక్సిన్లను బహిరంగ మార్కెట్లో విక్రయించవచ్చని కేంద్రం ఇటీవల ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రజల్లో అనేక సందేహాలు వ్యక్తమవడంతో కేంద్రం వీటిపై తాజాగా క్లారిటీ ఇచ్చింది. కరోనా టీకాలు మెడికల్ షాపుల్లో అందుబాటులో ఉండవని స్పష్టం చేసింది. కాగా.. దేశంలో ఇప్పటివరకూ దాదాపు 13 కోట్ల టీకా డోసులు ప్రజలకు అందాయి. ఇక మే 1 నుంచి పెద్దలందరికీ ఎటువంటి మినహాయింపులూ లేకుండా టీకా అందుబాటులోకి రానుంది. ఈ దఫా.. వ్యాక్సిన్ తయారీదారులు టీకాలను నేరుగా రాష్ట్రాలకు విక్రయించవచ్చు. బహిరంగ మార్కెట్లోనూ అమ్మకానికి పెట్టొచ్చు. అయితే..టీకా ధరలను ఆయా సంస్థలు మే 1కి ముందే ప్రకటించాల్సి ఉంటుంది. దీంతో.. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇప్పటివరకూ ఇస్తున్న రూ. 250ల సబ్సిడీ ధర ఇకపై అందుబాటులో ఉండదు. అయితే కేంద్రం గుర్తించిన టీకా కేంద్రాల్లో మాత్రం 45 ఏళ్లకు పైబడిన వారు ఉచితంగానే వ్యాక్సిన్ పొందవచ్చు. ప్రజలు టీకా పొందేందుకు తమ పేర్లను కొవిన్ పోర్టల్‌లో నమోదు చేసుకోవచ్చని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. 

Updated Date - 2021-04-22T00:03:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising