ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ను అనుమానించలేం

ABN, First Publish Date - 2021-11-27T07:09:18+05:30

కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ను అనుమానించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. టీకాల వల్ల కలుగుతున్న ప్రయోజనాలను చూస్తున్నాం.. డబ్ల్యూహెచ్‌వో కూడా.....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్పష్టంచేసిన సుప్రీం బెంచ్‌


న్యూఢిల్లీ, నవంబరు 26: కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ను అనుమానించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. టీకాల వల్ల  కలుగుతున్న ప్రయోజనాలను చూస్తున్నాం.. డబ్ల్యూహెచ్‌వో కూడా కొవిడ్‌ వ్యాక్సిన్లను గుర్తించిందని పేర్కొంది. ఈ పరిస్థితుల్లో టీకా కార్యక్రమాన్ని శంకించలేమని తేల్చి చెప్పింది. టీకా ప్రతికూలతల వల్ల వేల మంది చనిపోయారని, ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ను ప్రజల ఇష్టానికే(స్వచ్ఛందం) వదిలేసేలా కేంద్రానికి ఆదేశాలు జారీ చేయాలంటూ అజయ్‌కుమార్‌ గుప్తా, మరికొందరు దాఖలు చేసిన వ్యాజ్యాలను.. జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్నలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది. దీనిపై స్పందించిన ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది.


పిటిషన్‌ కాపీలను సొలిసిటర్‌ జనరల్‌కు అందజేయాలని పిటిషనర్లకు సూచించారు. కాగా.. కొవిడ్‌ ప్రభావానికి గురైన కుటుంబాల పునరావాసానికి డిమాండ్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్నల ధర్మాసనం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

Updated Date - 2021-11-27T07:09:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising