ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీకాలు వేసుకోండి ప్లీజ్‌!

ABN, First Publish Date - 2021-12-15T15:41:58+05:30

కరోనా మహమ్మారిని తరికొట్టేందుకు 18 ఏళ్లు పైబడిన వారంతా టీకాలు వేయించాలని కోరుతూ మన దేశానికి చెందిన ఓ సైనికుడు వినూత్న తరహాలో ఊరూరా అవగాహన కల్పిస్తున్నారు. 197 దేశాల పతాకాలతో ఆయన ప్రచారం చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                            - ఓ సైనికుడి ప్రచారం


ప్యారీస్‌(చెన్నై): కరోనా మహమ్మారిని తరికొట్టేందుకు 18 ఏళ్లు పైబడిన వారంతా టీకాలు వేయించాలని కోరుతూ మన దేశానికి చెందిన ఓ సైనికుడు వినూత్న తరహాలో ఊరూరా అవగాహన కల్పిస్తున్నారు. 197 దేశాల పతాకాలతో ఆయన ప్రచారం చేపట్టారు. కేంద్రప్రభుత్వం ప్రకటించిన విధంగా భారతదేశంలో 18 ఏళ్లు పైబడిన వారంతా తప్పనిసరిగా రెండు డోసుల కరోనా టీకాలు వేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలు రకరకాల చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మానామధురైకి చెందిన సైనికుడు ఎస్‌.బాల మురుగన్‌ (33) టీకాలపై అవగాహనా ప్రచారం చేపట్టారు. చెన్నైకి చేరుకున్న బాలమురుగన్‌ మీడియాతో మాట్లాడుతూ... కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగాలు అలుపెరగక అంకితభావంతో సేవలందిస్తున్నాయని పేర్కొన్నారు. వారికి కృతజ్ఞతలు తెలిపేలా ప్రతి ఒక్కరూ కరోనా టీకాలు వేయించుకోవాలని పిలుపునిచ్చారు. ఇదిలా వుండగా అక్టోబరు 16వ తేదీన రామనాథపురం జిల్లా పాంబన్‌ వంతెన నుంచి తన ప్రచారానికి స్వీకారం చుట్టిన బాలమురుగన్‌.. ఇప్పుడు నగరానికి చేరుకున్నారు. ఇప్పటి వరకూ 810 కి.మీ మేర పాదయాత్ర నిర్వహించారు. తరువాత ఆంధ్రప్రదేశ్‌ మీదుగా పలు రాష్ట్రాల్లోనూ పర్యటించనున్నారు. 

Updated Date - 2021-12-15T15:41:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising