ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌తో కోలుకున్న రోగికి గ్రీన్ ఫంగస్ ఇన్ఫెక్షన్

ABN, First Publish Date - 2021-06-16T12:48:36+05:30

కరోనా నుంచి కోలుకున్న ఓ రోగికి తాజాగా గ్రీన్ ఫంగస్ సోకిన ఘటన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇండోర్ (మధ్యప్రదేశ్): కరోనా నుంచి కోలుకున్న ఓ రోగికి తాజాగా గ్రీన్ ఫంగస్ సోకిన ఘటన ఆందోళన కలిగిస్తోంది. కొవిడ్ వైరస్ బారి నుంచి కోలుకున్న రోగికి గ్రీన్ ఫంగస్ ఇన్ఫెక్షన్ సోకిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో వెలుగుచూసింది. గ్రీన్ ఫంగస్ సోకిన రోగిని ఎయిర్ అంబులెన్సు ద్వారా ముంబై ఆసుపత్రికి తరలించామని సీనియర్ వైద్యులు చెప్పారు. శ్రీ అరబిందో ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో కొవిడ్ నుంచి కోలుకున్న వ్యక్తికి బ్లాక్ ఫంగస్ సంక్రమించిందనే అనుమానంతో పరీక్ష చేయగా గ్రీన్ ఫంగస్ అని తేలిందని ఆసుపత్రి డాక్టర్ రవి చెప్పారు. 




రోగి సైనస్, ఊపిరితిత్తులు, రక్తంలో ఆకుపచ్చ  ఫంగస్ సంక్రమించిందని తేలింది. ఆకుపచ్చ ఫంగస్ సంక్రమణపై మరిన్ని పరిశోధనలు అవసరమని వైద్యులు చెప్పారు. గ్రీన్ ఫంగస్ సోకిన వ్యక్తి కరోనా వైరస్ తో స్థానిక ఆసుపత్రిలో నెలరోజుల పాటు ఐసీయూలో చికిత్స పొందారు. కరోనా నుంచి కోలుకున్నా, ముక్కు నుంచి రక్తస్రావం కావడం, అధిక జ్వరంతో పాటు బరువు తగ్గడంతో అతనికి పరీక్ష చేయగా గ్రీన్ ఫంగస్ అని తేలిందని డాక్టర్ రవి చెప్పారు. 

Updated Date - 2021-06-16T12:48:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising