ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోవిడ్ ఎఫెక్ట్ : కరెన్సీ ముద్రణ నిలిపివేత

ABN, First Publish Date - 2021-04-16T22:17:56+05:30

కోవిడ్ మహమ్మారి రెండో ప్రభంజనం ప్రభావం కరెన్సీ ముద్రణపై కూడా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : కోవిడ్ మహమ్మారి రెండో ప్రభంజనం ప్రభావం కరెన్సీ ముద్రణపై కూడా పడింది. మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ‘బ్రేక్ ది చైన్’ క్యాంపెయిన్‌‌కు స్పందిస్తూ నాసిక్‌లోని కరెన్సీ సెక్యూరిటీ ప్రెస్, ఇండియా సెక్యూరిటీ ప్రెస్ ఈ నెల 30 వరకు కరెన్సీ ముద్రణను నిలిపివేశాయి. 


రాష్ట్రంలో కోవిడ్ మహమ్మారి విలయ తాండవాన్ని అడ్డుకునేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం  ‘బ్రేక్ ది చైన్’ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. దీనిలో భాగంగానే ఈ నెల 30 వరకు కరెన్సీ ముద్రణను నిలిపేసింది. దీంతో నాసిక్‌లోని కరెన్సీ సెక్యూరిటీ ప్రెస్, ఇండియా సెక్యూరిటీ ప్రెస్‌లలో నగదు ముద్రణ నిలిచిపోయింది. అయితే అత్యవసర పరిస్థితుల్లో సేవలందించేందుకు అవసరమైన సిబ్బంది మాత్రమే ఈ ముద్రణాలయాల్లో విధులకు హాజరవుతారు. అగ్నిమాపక, నీటి సరఫరా, వైద్య సేవలు వంటి విభాగాలకు చెందినవారు హాజరవుతారు. 


మన దేశంలో చలామణీలో ఉండే నోట్లలో 40 శాతం నోట్లు నాసిక్‌లోని ముద్రణాలయాల్లోనే తయారవుతాయి. వీటిలో సుమారు 3 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. 


Updated Date - 2021-04-16T22:17:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising