ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశాన్ని వణికిస్తోన్న డెల్టా ప్లస్ వేరియంట్

ABN, First Publish Date - 2021-08-14T23:08:20+05:30

దేశాన్ని వణికిస్తోన్న డెల్టా ప్లస్ వేరియంట్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. డెల్టా ప్లస్ వేరియంట్ మహారాష్ట్రను వణికిస్తోంది. ముంబై, బీడ్, రత్నగిరి, రాయగఢ్ ప్రాంతాల్లో 66 మందికి కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ సోకింది. ఆందోళన కలిగించే డెల్టా ప్లస్‌ వేరియంట్‌తో ముంబైలో తొలి మరణం నమోదైంది. డెల్టా ఫ్లస్‌ కారణంగా మహారాష్ట్రలో మరణించిన వారి సంఖ్య ఐదుకు పెరిగింది. డెల్టా ప్లస్ వేరియంట్ తో మరణించిన వారంతా 65 ఏళ్ల వయసు పైబడిన వారేనని వైద్యులు తెలిపారు. ప్రమాదకరమైన ఈ వేరియంట్ వల్ల రత్నగిరిలో ఇద్దరు, బీడ్, రాయగఢ్ ప్రాంతాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు. డెల్టా ప్లస్ వైరస్ వల్ల మరణించిన వారిలో టీకాలు వేయించుకున్న వారు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ముంబై, పూణేలలో డెల్టాప్లస్ వేరియంట్ కేసులు భారీగా బయటపడ్డాయి. జల్గావ్ జిల్లాలో 13 కేసులు నమోదైనాయి. రత్నగిరి జిల్లాలో 12, ముంబైలో 11 కేసులు వెలుగుచూశాయి.66 డెల్టా ప్లస్ వేరియంట్ కేసుల్లో 32మంది పురుషులున్నారు. ఏడుగురు రోగులు 18 ఏళ్ల లోపువారు కూడా ఉండటం ఆందోళనకు గురిచేస్తోంది.

Updated Date - 2021-08-14T23:08:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising