ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేరళలో కరోనా విజృంభణ... ఒక్కరోజులో 22 వేలు దాటిన కేసులు... 131 మంది మృతి!

ABN, First Publish Date - 2021-07-29T12:18:27+05:30

కేరళలో కరోనా వైరస్ తిరిగి విజృంభిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరువనంతపురం: కేరళలో కరోనా వైరస్ తిరిగి విజృంభిస్తోంది. వరుసగా రెండో రోజు కూడా 22 వేల పైచిలుకు కరోనా కేసులు నమోదయ్యాయి. గత రెండు నెలలు డేటాను పరిశీలిస్తే.. ప్రతి రోజూ పది వేలకుపైగా పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. అయితే ఈ సంఖ్య మంగళవారం నాడు 22వేలు దాటగా, గడిచిన 24 గంటల్లో కొత్తగా 22,056 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 


ఇదే సమయంలో కరోనా కారణంగా 131 మంది కన్నుమూశారు. దీంతో కేరళలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 33,27,301కు చేరుకుంది అలాగే మొత్తం మరణాల సంఖ్య 16,457కు పెరిగింది. ప్రస్తుతం కేరళలో పాజిటివిటీ రేటు 11.3శాతంగా ఉంది. గడచిన 24 గంటల్లో కరోనా నుంచి 17,761 మంది కోలుకున్నారు. ఫలితంగా కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 31,60,804కు చేరింది.  రాష్ట్రంలో ప్రస్తుతం 1,49,534 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.  ఇప్పుడు దేశంలో కరోనా హాట్‌స్పాట్‌గా కేరళ ముందుకొచ్చింది. దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య తగ్గుతున్నా, కేరళలో అత్యధికంగా కొత్త కేసులు నమోదవుతుండటం ఆందోళనకరంగా మారింది. 

Updated Date - 2021-07-29T12:18:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising