ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిల్లలపై క్లినికల్ ట్రయల్స్ నిలిపివేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో కేసు

ABN, First Publish Date - 2021-06-04T02:48:34+05:30

రెండు నుంచి 18 ఏళ్ల వయసున్న పిల్లలపై జరగనున్న కొవ్యాక్సిన్ టీకా ఫేస్ 2/3 క్లినికల్ ట్రయల్స్‌ను నిలిపివేయాంటూ ఢిల్లీ హైకోర్టులో ఓ వ్యాజ్యం దాఖలైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: రెండు నుంచి 18 ఏళ్ల వయసున్న పిల్లలపై జరగనున్న కొవ్యాక్సిన్  టీకా ఫేజ్ 2/3 క్లినికల్ ట్రయల్స్‌ను నిలిపివేయాంటూ ఢిల్లీ హైకోర్టులో ఓ వ్యాజ్యం దాఖలైంది. ఈ ట్రయల్స్‌కు అనుమతిస్తూ భారత్ ఔషధ నియంత్రణ సంస్థ ఇచ్చిన ఆదేశాలను పక్కనపెట్టాలని సంజీవ్ కూమార్ అనే వ్యక్తి కోర్టు తలుపు తట్టారు. ఈ విషయం ఇప్పటికే కోర్టు పరిధిలో ఉందని, కేంద్ర ప్రభుత్వానికి, భారత్ బయెటెక్‌కు నోటీసులు కూడా అందాయని సంజీవ్ పేర్కొన్నారు. అయినప్పటికీ..క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయని సంజీవ్ కోర్టుకు నివేధించారు. అయితే..కోర్టు స్టే విధించకపోవడంతో ప్రభుత్వం క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించిందని పేర్కొన్నారు. జులై 15న కోర్టు మళ్లీ విచారణ ప్రారంభమయ్యే నాటికి ట్రయల్స్ కొనసాగుతుంటాయని, అప్పుడు ప్రభుత్వం, భారత్ బయోటెక్ ఈ కేసు నిరుపయోగమని వాదించే అవకాశం ఉందని తెలిపారు. 


అంతేకాకుండా.. ఈ ట్రయల్స్‌లో పాల్గొన్న పిల్లల్లో శారిరక, మానసిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్న విషయన్నీ  ప్రస్తావించారు. ఈ ట్రయల్స్‌లో చిన్నారులు స్వఛ్చందంగా పాల్గొంటున్నారని(వలంటీర్స్‌గా) భావించలేమని, వారికి తమ నిర్ణయం వల్ల కలిగే ఫలితాలను పూర్థి స్థాయిలో అర్థం చేసుకునే శక్తి ఉండదని చెప్పారు. కాబట్టి..ఆరోగ్యంగా ఉన్న పిల్లలపై జరిగే ఈ ప్రక్రియను నరహత్యగా(హోమిసైడ్) భావించాలని, దురదృష్టవశాత్తూ వారు మరణిస్తే ట్రయల్స్‌లో పాల్గొన్న వారిపై, అనుమతులు ఇచ్చిన వారిపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని న్యాయస్థానాన్ని కోరారు.

Updated Date - 2021-06-04T02:48:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising