ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోవిడ్-19 వేరియంట్‌ను మట్టుబెడుతున్న కోవాగ్జిన్ : డాక్టర్ ఫాసీ

ABN, First Publish Date - 2021-04-28T20:51:56+05:30

భారత్ బయోటెక్ తయారు చేస్తున్న కోవాగ్జిన్ వ్యాక్సిన్ కోవిడ్-19కు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్ : భారత్ బయోటెక్ తయారు చేస్తున్న కోవాగ్జిన్ వ్యాక్సిన్ కోవిడ్-19కు చెందిన 617 వేరియంట్‌ను సమర్థవంతంగా మట్టుబెడుతోందని వైట్ హౌస్ చీఫ్ మెడికల్ అడ్వయిజర్, అమెరికా టాప్ పాండెమిక్ ఎక్స్‌పర్ట్ డాక్టర్ ఆంథోనీ ఫాసీ చెప్పారు. దీనిపై ప్రతి రోజూ సమాచారాన్ని తెప్పించుకుని, పరిశీలిస్తున్నామని చెప్పారు. ఆయన మంగళవారం విలేకర్లతో కాన్ఫరెన్స్ కాల్‌లో మాట్లాడారు. 


కోవిడ్-19 నుంచి కోలుకున్న వ్యక్తుల రక్త నమూనాలను, భారత దేశంలో కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ను తీసుకున్నవారి సమాచారాన్ని పరిశీలించినట్లు డాక్టర్ ఫాసీ చెప్పారు. కోవిడ్-19కు చెందిన 617 వేరియంట్‌ను కోవాగ్జిన్ మట్టుబెట్టినట్లు గుర్తించామన్నారు. ప్రస్తుతం భారత దేశంలో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ, కోవిడ్-19కు విరుగుడుగా వ్యాక్సినేషన్ చాలా చాలా ముఖ్యమైనదని పేర్కొన్నారు. 


‘న్యూయార్క్ టైమ్స్’ మంగళవారం ప్రచురించిన వివరాల ప్రకారం, ఎస్ఏఆర్ఎస్-సీఓవీ-2 కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా యాంటీబాడీస్‌ను తయారు చేసుకునే విధంగా రోగ నిరోధక వ్యవస్థకు నేర్పించడం ద్వారా కోవాగ్జిన్ పని చేస్తుంది. వైరల్ ప్రొటీన్స్‌కు యాంటీబాడీస్ అంటుకుని ఉంటాయి. కోవాగ్జిన్‌ను  భారత్ బయోటెక్ అభివృద్ధిపరిచింది. జాతీయ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్, భారత వైద్య, పరిశోధన మండలి (ఐసీఎంఆర్)లతో కలిసి భారత్ బయోటెక్ ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధిచేసింది. ఈ వ్యాక్సిన్‌ను అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించేందుకు కేంద్ర ప్రభుత్వం జనవరి 3న అనుమతి ఇచ్చింది. 


ప్రయోగాత్మక పరీక్షల్లో కోవాగ్జిన్ వ్యాక్సిన్ సామర్థ్యం 78 శాతమని వెల్లడైంది. తాజా సమాచారం ప్రకారం, మన దేశంలో తయారవుతున్న రెండు వ్యాక్సిన్లు (కోవిషీల్డ్, కోవాగ్జిన్)  కూడా కరోనా వైరస్ ఇండియన్ స్ట్రెయిన్ (బీ.1.617 వేరియంట్)  లేదా ‘‘డబుల్ మ్యుటెంట్’’పై గట్టి ప్రభావం చూపుతున్నాయి. 


Updated Date - 2021-04-28T20:51:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising