ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ ఆధ్వర్యంలోని తాలిబన్ల గుప్పిట్లో దేశం: టికాయత్

ABN, First Publish Date - 2021-08-29T20:03:19+05:30

రైతులపై హర్యానా పోలీసులు విచక్షణారహితంగా జరిపిన లాఠాచార్జీపై భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేష్ టికాయత్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నల్ (హర్యానా): రైతులపై హర్యానా పోలీసులు విచక్షణారహితంగా జరిపిన లాఠాచార్జీపై భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేష్ టికాయత్ నిప్పులు చెరిగారు. హర్యానా ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని తాలిబన్ల గుప్పిట్లోకి దేశం వెళ్తోందని, ప్రభుత్వ తాలిబన్ కమాండర్ ప్రస్తుతం దేశంలోనే ఉన్నారని, ఈ కమాండర్లను గుర్తించాల్సి ఉందని వ్యాఖ్యానించారు. ''తలబద్దలు కొట్టండని ఆ కమాండర్ ఆదేశాలు ఇస్తారు. పోలీసు బలగాలతో ఈ దేశాన్ని స్వాధీనం చేసుకోవాలని వారు అనుకుంటున్నారు''అని టికాయత్ అన్నారు.


హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను 'జనరల్ డయ్యర్‌'తో పోలుస్తూ టికాయత్ ఆదివారం ఉదయం ఓ ట్వీట్ చేశారు. ఖట్టర్ ప్రవర్తన జనరల్ డయ్యర్‌ తరహాలో ఉందంటూ విరుచుకుపడ్డారు. హర్యానా పోలీసులు రైతులపై జరిపిన అకృత్యాలను సహించలేమని, రైతులే తగిన బదులు ఇస్తారని చెప్పారు. కర్నల్‌‌లో జరిగిన లాఠీ చార్జికి నిరసనగా శనివారం సాయంత్రం 5 గంటల వరకూ అన్ని జాతీయరహదారులు, టోల్ ప్లాజాలు దిగ్బంధం చేయాలని అంతకుముందు టికాయత్ రైతులకు పిలుపునిచ్చారు.

Updated Date - 2021-08-29T20:03:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising