ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిపిలి నియోజకవర్గం: ఆధిక్యంలో బీజేడీ

ABN, First Publish Date - 2021-10-03T18:50:31+05:30

ఒడిశాలోని పూరీ జిల్లా పిపిలి అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. ఉదయం 8 గంటలకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భువనేశ్వర్: ఒడిశాలోని పూరీ జిల్లా పిపిలి అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. ఉదయం 8 గంటలకు భారీ భద్రత, కట్టుదిట్టమైన కోవిడ్ ప్రోటాకాల్స్ మధ్య కౌంటింగ్ మొదలైంది. మధ్యాహ్నం 1 గంట వరకూ వెలువడిన ఫలితాల ప్రకారం బిజూ జనతాదళ్ (బీజేడీ) అభ్యర్థి రుద్ర ప్రతాప్ మహారథి 23,462 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆయనతో పాటు బీజేపీ అభ్యర్థి ఆశ్రిత్ పట్నాయక్, కాంగ్రెస్ అభ్యర్థి బిశ్వక్‌సేన్ మొహాపాత్ర, మరో ఏడుగురు పోటీలో ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రతాప్ మహారథి 2020 అక్టోబర్‌లో కన్నుమూయడంతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. ఆయన కుమారుడు రుద్రప్రతాప్‌ను బీజేడీ తమ అభ్యర్థిగా బరిలోకి దింపింది. కాగా, పూర్తిగా వ్యాక్సినేషన్ వేయించుకున్న 72 మంది ప్రభుత్వ అధికారులు కౌంటింగ్‌ ప్రక్రియలో పాల్గొంటున్నారు. మూడు హాల్స్‌లోని 14 టేబుల్స్ వద్ద కౌంటింగ్ జరుగుతోంది. రెండు హాళ్లలో ఈవీఎం ఓట్ కౌంటింగ్, మరో హాలులో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ చేపట్టారు. ఒక అదనపు ఎస్‌పీ, ఇద్దరు డీఎస్‌పీలతో సహా 5 ప్లాటూన్ల బలగాలను పిపిలిలో మోహరించారు.

Updated Date - 2021-10-03T18:50:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising