ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ashraf Ghani: డబ్బు తీసుకెళ్లలేదు...బూట్లు కూడా ధరించలేక పోయాను

ABN, First Publish Date - 2021-08-19T12:58:45+05:30

తాను తాలిబాన్ల నుంచి తప్పించుకునేందుకు సంప్రదాయ బట్టలు, ఒక చొక్కా, చెప్పులతోనే అఫ్ఘానిస్థాన్ ను విడిచి వెళ్లాల్సివచ్చిందని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుబాయ్ : అఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ కాబూల్ నుంచి పారిపోయిన తర్వాత మొదటిసారి వీడియోను విడుదల చేశారు. తాను తాలిబాన్ల నుంచి తప్పించుకునేందుకు సంప్రదాయ బట్టలు, ఒక చొక్కా, చెప్పులతోనే అఫ్ఘానిస్థాన్ ను విడిచి వెళ్లాల్సివచ్చిందని అష్రఫ్ ఘనీ వీడియో సందేశంలో చెప్పారు.అఫ్ఘానిస్థాన్ దేశం నుంచి పారిపోయే ముందు దేశ నిధుల నుంచి 169 మిలియన్ డాలర్లను దొంగిలించి తీసుకెళ్లానని రష్యా దేశ దౌత్యవేత్త చేసిన వ్యాఖ్యలను ఘనీ ఖండించారు. తాను యునైటెడ్ ఎమిరేట్స్ లో ఉన్నానని ఘనీ ధ్రువీకరించారు. 


తాను డబ్బు తీసుకెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయని, ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని ఘని వీడియోలో వివరించారు.తాను నాలుగు కార్లు, హెలికాప్టరు నిండా నగదుతో కాబూల్ నుంచి పారిపోయానని రష్యా రాయబారి చేసిన ఆరోపణలను ఘనీ కొట్టివేశారు. నేను డబ్బుతో పారిపోయాననేది అబద్ధం, దీన్ని యూఏఈ కస్టమ్స్ అధికారులతోనూ ధ్రువీకరించుకోవచ్చని ఘని చెప్పారు. దేశాధినేతగా తనకున్న ముప్పతో పారిపోయానని చెప్పారు. 


దేశంలో రక్తపాతాన్ని నివారించడానికి ఏకైకమార్గంగా తాను కాబూల్ నుంచి పారిపోవాలని తీసుకున్న నిర్ణయాన్ని ఘనీ సమర్థించుకున్నారు. అఫ్ఘాన్ భద్రతా దళాలకు ఘనీ కృతజ్ఞతలు తెలిపారు. శాంతి ప్రక్రియ వైఫల్యం తాలిబాన్లు అధికారాన్ని లాక్కోవడానికి దారితీసిందని ఆయన చెప్పారు. తాలిబాన్లు కాబూల్ చేరుకున్నప్పుడే అఫ్ఘాన్ అధ్యక్షుడు ఘనీ అఫ్ఘాన్ ను వదిలి పారిపోయారు.

Updated Date - 2021-08-19T12:58:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising