ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెద్దలందరికీ టీకా.. మొత్తం ఖర్చు ఎంతంటే..

ABN, First Publish Date - 2021-04-23T01:27:07+05:30

టీకా ఇవ్వాలంటే దాదాపు రూ. 671.93 బిలియన్లు ఖర్చవుతుందని ఇండియా రేటింగ్స్ సంస్థ తాజాగా లెక్కగట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో 18 ఏళ్లకు పైబడిన వారందరికీ కరోనా టీకా వేయాలని కేంద్రం నిర్ణయించింది. మే 1 నుంచీ ప్రారంభం కానున్న మూడో దఫా టీకా కార్యక్రమంలో పెద్దలందరికీ టీకా అందుబాటులోకి రానుంది. అయితే..ఓ అంచనా ప్రకారం భారత జనాభా మొత్తం 133 కోట్లు. అందులో 18 ఏళ్లకు పైబడిన వారి సంఖ్య 84.2 కోట్లు. వీరందరికీ టీకా ఇవ్వాలంటే దాదాపు రూ. 671.93 బిలియన్లు ఖర్చవుతుందని ఇండియా రేటింగ్స్ సంస్థ తాజాగా లెక్కగట్టింది. బుధవారం విడుదలైన టీకా ధరల ఆధారంగా ఇండియా రేటింగ్స్ ఈ అంచనాకు వచ్చింది. ఈ ఖర్చు దేశ జీడిపీలో దాదాపు 0.36 శాతం కావడంతో ప్రభుత్వం ఈ మొత్తాన్ని భరించగలదని కూడా వ్యాఖ్యానించింది. ఈ మొత్తాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా భరిస్తే కేంద్రం తన బడ్జెట్‌లో 0.12 శాతాన్ని, రాష్ట్రాల మొత్తం బడ్జెట్‌లో 0.264 శాతాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది. ‘‘ప్రస్తుతమున్న సమస్య తీవ్రత, అర్థికవ్యవస్థపై పడే ప్రభావం దృష్ట్యా ఈ మొత్తం చాలా చిన్నది’’ అని ఇండియా రేటింగ్స్ పేర్కొంది.

Updated Date - 2021-04-23T01:27:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising