ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Covid Vaccinationలో టాప్... హిమాచల్ ప్రదేశ్... రెండవ స్థానంలో ఢిల్లీ!

ABN, First Publish Date - 2021-07-14T13:58:37+05:30

దేశంలో ఒకవైపు కరోనా సెకెండ్ వేవ్...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలో ఒకవైపు కరోనా సెకెండ్ వేవ్ తగ్గుముఖం పట్టడం, మరోవైపు వ్యాక్సినేషన్ జోరందుకోవడం ఉపశమనం కలిగించే విషయాలుగా మారాయి. జనాభా పరంగా చూసుకుంటే అత్యధికంగా వ్యాక్సినేషన్ జరిగిన రాష్ట్రాల్లో హిమాచల్‌ప్రదేశ్ టాప్ లో ఉంది. రెండవస్థానంలో ఢిల్లీ ఉండగా, బీహార్ 10వ స్థానంలో, యూపీ 11వ స్థానంలో ఉన్నాయి. కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ అందించిన వివరాల ప్రకారం హిమాచల్‌ప్రదేశ్‌లో 18 ఏళ్లు దాటిన 61.1 శాతం జనాభాకు కనీసం ఒక డోసు టీకానైనా వేశారు. 


దేశంలో అత్యధిక టీకాలు వేసిన రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ నిలిచింది. తరువాతి ప్లేస్‌లో దేశరాజధాని ఢిల్లీ నిలిచింది. ఢిల్లీలో 18 ఏళ్లు దాటిన 45.4 శాతం జనాభాకు టీకాలు వేశారు. మూడవ స్థానంలో గుజరాత్(44.4%) నిలిచింది. టీకాలు వేయడం విషయంలో యూపీ, బీహార్ చాలా వెనుకబడివున్నాయి. బీహార్‌లో ఇప్పటివరకూ కేవలం 22 శాతం జనాభాకు మాత్రమే టీకాలు వేయగా, యూపీలో 21.5 శాతం జనాభాకు మాత్రమే టీకాలు వేశారు. కాగా దేశంలో ఇప్పటివరకూ 38.50 కోట్ల ప్రజలకు టీకాలు వేశారు. వీరిలో 30.87 కోట్ల మంది మొదటి డోసు టీకా తీసుకోగా, 7.62 కోట్ల మంది రెండు డోసుల టీకా తీసుకున్నారు. 

Updated Date - 2021-07-14T13:58:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising