ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Coronavirus: కేరళలో పెరుగుతున్న కరోనా కేసులు.. కట్టడికి సర్కారు ప్రత్యేక చర్యలు!

ABN, First Publish Date - 2021-08-25T13:12:14+05:30

గతంతో పోల్చిచూస్తే దేశంలో కరోనా కేసుల సంఖ్య...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరువనంతపురం: గతంతో పోల్చిచూస్తే దేశంలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. అయితే కొన్ని రాష్ట్రాల్లోని కరోనా పరిస్థితులు ఇప్పటికీ ఆందోళన కలిగిస్తున్నాయి. వాటిలో కేరళ ఒకటి. ఈ రాష్ట్రంలో టెస్ట్ పాజిటివీటీ రేటు(టీపీఆర్) అంతకంతకూ పెరుగుతోంది. దీంతో రాష్ట్రంలో వ్యాక్సినేషన్ తక్కువగా జరుగుతున్న జిల్లాల్లో టెస్టుల సంఖ్యను మరింతగా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత రెండు నెలలుగా జాతీయ టీపీఆర్ రేటు మూడుకు దిగువగా ఉంటుండగా, కేరళలో మాత్రం పెరుగుతోంది. కేరళలో ఒక్క నెలలోనే టీపీఆర్ రేటు 18 శాతానికి చేరుకుంది. గడచిన 24 గంటల్లో కేరళలో కొత్తగా  24 వేల 296 కరోనా కేసులు నమోదయ్యాయి. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశంలో రాష్ట్రంలోని వయినాడ్, పథానంథిట్ట, తిరువనంతపురం, ఎర్నాకులం జిల్లాలలో వ్యాక్సినేషన్ ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఈ నాలుగు జిల్లాలలో కరోనా టెస్టుల సంఖ్యను కూడా పెంచాలని సూచించారు. 

Updated Date - 2021-08-25T13:12:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising