ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ రాష్ట్రాల్లో ఇప్ప‌టికీ ల‌క్ష‌కుపైగా క‌రోనా యాక్టివ్ కేసులు

ABN, First Publish Date - 2021-06-17T16:32:58+05:30

దేశంలో కరోనా క‌రోనా సెకెండ్ వేవ్ కాస్త బ‌ల‌హీన‌ప‌డుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలో కరోనా క‌రోనా సెకెండ్ వేవ్ కాస్త బ‌ల‌హీన‌ప‌డుతోంది. అయితే ప‌లు రాష్ట్రాల్లో ఇప్ప‌టికీ లెక్క‌కుమించి ఉన్న క‌రోనా యాక్టివ్ కేసులు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. గ‌డ‌చిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్త‌గా  67,208 క‌రోనా కేసులు నమోద‌య్యాయి. ఇదేస‌మ‌యంలో లక్షమందికి పైగా బాధితులు కోలుకున్నారు. యాక్టివ్ కేసుల‌ సంఖ్య 8,26,740కి చేరింది. దేశంలో ఇప్పటికీ 4 రాష్ట్రాల్లోని క‌రోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలోని స‌గం యాక్టివ్ కేసులు ఈ రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఈ జాబితాలో మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఉన్నాయి. కర్ణాటకలో అత్యధికంగా 1,51,566 యాక్టివ్‌ కేసులు ఉండగా, మహారాష్ట్రలో 1,36,661 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక‌ తమిళనాడు 1.14 లక్ష‌ల‌కు పైగా కేసులతో మూడవ స్థానంలో, కేరళ 1,09,799 కేసులతో నాల్గవ స్థానంలో ఉన్నాయి. ఈ రాష్ట్రాలే కాకుండా ఆంధ్రప్రదేశ్ 71 వేల‌కుమించిన‌ క్రియాశీల కేసులతో ఐద‌వ‌ స్థానంలో ఉంది. ఈ ఐదు రాష్ట్రాల గణాంకాలను పరిశీలిస్తే 5.80 లక్షల కేసులు ఈ రాఫ్ట్రాల్లోనే ఉన్నాయి. దేశంలోని మొత్తం కేసుల‌లో 70 శాతానికి పైగా కేసులు ఈ రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఇక‌ ఒడిశాలోనూ క‌రోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇక్కడ యాక్టివ్‌ కేసుల సంఖ్య 42 వేల‌కుపైగా ఉంది. పశ్చిమ బెంగాల్‌లో 21,152 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 

Updated Date - 2021-06-17T16:32:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising