ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

corona virus cases raised తమిళనాడులో కరోనా విలయ తాండవం... కేరళలో ఒక్క రోజులో 14 వేల కేసులు!

ABN, First Publish Date - 2021-07-11T12:35:39+05:30

దేశంలో గడచిన వారం రోజులలో నమోదైన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: corona virus cases దేశంలో గడచిన వారం రోజులలో నమోదైన మొత్తం కేసులలో 50 శాతం కేసులు కేరళ, మహారాష్ట్రకు చెందినవే ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల తరువాత ఇప్పుడు తమిళనాడులో కూడా కరోనా కేసులు లెక్కకుమించి పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపిన వివరాల ప్రకారం దేశంలోని 80 శాతం కేసులు 15 రాష్ట్రాల్లోని 90 జిల్లాల్లోనే ఉన్నాయిని పేర్కొన్నారు. ఇప్పుడు తమిళనాడులోని 12 జిల్లాల్లో గడచిన వారం రోజులలో ప్రతీరోజూ 85కు పైగా కేసులు నమోదవుతూ వస్తున్నాయి. చెంగల్పట్టు, చెన్నై, కోయంబత్తూర్, ఈరోడ్, నమక్కల్, నీలగిరి, సేలం, తంజావూర్, త్రిపుర, త్రిచి, తిరువణ్ణామలై, కడలూరు తదితర ప్రాంతాల్లో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్నాయి.


తమిళనాడులో కరోనా సెకెండ్ వేవ్ మే నుంచి కనిపించింది. ఆ నెల చివరి నాటికి పీక్ స్టేజికి చేరింది. ఈ నేపధ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాష్ట్రంలో ఈనెల 19 వరకూ లాక్ డౌన్ పొడిగించారు. ఈ సమయంలో కొన్ని మినహాయింపులు కూడా ప్రకటించారు. కేరళలో గడచిన 24 గంటల్లో కొత్తగా 14,087 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ సందర్భంగా కేరళ ముఖ్యమంత్రి పీ విజయన్ మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల్లో కరోనా సెకెండ్ వేవ్ మే నెలలో ప్రారంభమైతే, కేరళలో మే నెల మధ్యలో మొదలైందన్నారు.  రాష్ట్రంలో గతంలో పాజిటివిటీ రేటు 29 శాతం ఉండేదని, ఇప్పుడు తగ్గిందని, కరోనా కేసులు అదుపులోకి వస్తున్నాయని తెలిపారు.

Updated Date - 2021-07-11T12:35:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising