ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌లో మళ్లీ విజృంభిస్తున్న కరోనా

ABN, First Publish Date - 2021-02-28T16:52:49+05:30

భారత దేశంలో కరోనా మళ్లీ విజృంబిస్తోంది. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో కరోనా కేసులు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత దేశంలో కరోనా మళ్లీ విజృంబిస్తోంది. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో ప్రజల్లో కూడా ఆందోళన మొదలైంది. ఈ క్రమంలోనే కేంద్రం కరోనా కేసులకు సంబంధించి తాజా లెక్కలను విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా కేవలం ఆరు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. మొత్తం కేసుల్లో 85.75 శాతం ఆ రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి.


మహారాష్ట్రలో అత్యధికంగా 8,623 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కేరళలో 3,671, పంజాబ్‌ 622, కర్నాటక 571, తమిళనాడు 481, గుజరాత్‌‌లో 460 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా గత 24గంటల్లో దేశ వ్యాప్తంగా 16,488 కరోనా కేసులు నమోదయ్యాయి.


మహారాష్ట్రలో కరోనా కలకలం కొనసాగుతోంది. ఆ రాష్ట్రంలో 8వేల కేసులు దాటడం వరుసగా నాలుగోసారి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 21,46,777కు చేరుకుంది. మరణాలరేటు 2.43 శాతంగా నమోదైంది. కరోనా పరీక్షలకు సంబంధించిన పాజిటీవిటీ రేటు 13.25శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 3.3 లక్షల మంది హోం క్వారంటైన్‌లో ఉండగా.. 3,084 మంది ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్‌లలో ఉన్నారు. మరోవైపు మొత్తం కరోనా మరణాల సంఖ్య 10,302కు చేరుకుంది. కరోనా కట్టడి కోసం అక్కడి ప్రభుత్వం అమరావతి జిల్లాల్లో లాక్ డౌన్‌ను మార్చి 8 వరకు పొడిగించింది. కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

Updated Date - 2021-02-28T16:52:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising