ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

150కి కొత్త స్ట్రెయిన్‌ కేసులు

ABN, First Publish Date - 2021-01-24T08:33:01+05:30

దేశంలో కరోనా కొత్త స్ట్రెయిన్‌ కేసులు 150కి చేరాయి. శనివారం మరో ఐదుగురికి స్ట్రైయిన్‌ నిర్ధారణ అయినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • 14,256 మందికి పాజిటివ్‌ 


న్యూఢిల్లీ, జనవరి 23: దేశంలో కరోనా కొత్త స్ట్రెయిన్‌ కేసులు 150కి చేరాయి. శనివారం మరో ఐదుగురికి స్ట్రైయిన్‌ నిర్ధారణ అయినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గురువారం వరకు బాధితుల సంఖ్య 145గా ఉంది. మరోవైపు దేశంలో శుక్రవారం 14,256 మందికి పాజిటివ్‌ వచ్చింది. వైర్‌సతో 152 మంది మృతిచెందారు. మరో 17,130 మంది కోలుకోవడంతో రికవరీలు 1.03 లక్షలు దాటాయి. యాక్టివ్‌ కేసులు 1.85 లక్షలకు తగ్గాయి. శుక్రవారం 8.37 లక్షల పరీక్షలు చేశారు. దేశంలో శనివారం 1,46,598 మందికి కరోనా టీకా వేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు 15,37,190 మందికి టీకా పంపిణీ పూర్తయినట్లు పేర్కొంది. 13 దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు వివరించింది. కరోనా టీకా తీసుకున్నవారి ఆరుగురు మరణించారని.. అయితే ఇవేవీ టీకా కారణంగా సంభవించినవి కాదని తెలిపింది. 11 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని.. టీకా వేశాక ఆస్పత్రిపాలైన వారిలో వీరి శాతం 0.0007 అని కేంద్రం చెప్పింది. ఏపీలోని గుంటూరులో జనవరి 20న టీకా తీసుకున్న వ్యక్తి తాజాగా ఆస్పత్రిలో చేరినట్లు తెలిపింది. 



Updated Date - 2021-01-24T08:33:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising