ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రసవం తర్వాత ఎప్పుడైనా వ్యాక్సినేషన్‌

ABN, First Publish Date - 2021-05-24T10:39:35+05:30

మహిళలు ప్రసవం తర్వాత ఎప్పుడైనా కరోనా వ్యాక్సిన్‌ వేయించుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే పాలిచ్చే (బ్రెస్ట్‌ ఫీడింగ్‌) మహిళలు కూడా వ్యాక్సిన్‌ తీసుకోవచ్చని నీతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలిచ్చే తల్లులకూ క్షేమం అంటున్న నిపుణులు


న్యూఢిల్లీ, మే 2: మహిళలు ప్రసవం తర్వాత ఎప్పుడైనా కరోనా వ్యాక్సిన్‌ వేయించుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే పాలిచ్చే (బ్రెస్ట్‌ ఫీడింగ్‌) మహిళలు కూడా వ్యాక్సిన్‌ తీసుకోవచ్చని నీతి ఆయోగ్‌ వైద్య విభాగం సూచిస్తోంది. తల్లికి వ్యాక్సినేషన్‌ వల్ల పాలుతాగే బిడ్డకుగానీ, తల్లికిగానీ ఎలాంటి ఇబ్బంది ఉండదని ఢిల్లీ యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌కు చెందిన ప్రొఫెసర్‌ ఖాన్‌ అమీర్‌ మరూఫ్‌ చెప్పారు.


పాలిచ్చే తల్లులు వ్యాక్సిన్‌ తీసుకోవడానికి అనుమతిస్తూ కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకొంది. ఈ నేపథ్యంలో గర్భిణీలకు కూడా వ్యాక్సినేషన్‌ ఇవ్వాలని వైద్యులు కోరుతున్నారు. అయితే కరోనా సోకిన గర్భిణీలు ప్రసవం తర్వాత మూన్నెల్ల వరకు వ్యాక్సినేషన్‌కు దూరంగా ఉండటం మంచిదని ఢిల్లీకి చెందిన ప్రసూతి వైద్యురాలు డాక్టర్‌ లవ్లీనా నాదిర్‌ తెలిపారు. మనదేశంలో గర్భిణీలకు ఇంకా వ్యాక్సినేషన్‌ ఇవ్వడం లేదని మరో వైద్యుడు డాక్టర్‌ సుజీత్‌ రంజన్‌ చెప్పారు.

Updated Date - 2021-05-24T10:39:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising