ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా మూడోవేవ్‌ 98 రోజులు!

ABN, First Publish Date - 2021-06-03T09:07:05+05:30

కరోనా సెకండ్‌ వేవ్‌లా, మూడోవేవ్‌ కూడా ఉధృతంగానే ఉండొచ్చంటూ ‘ఎస్‌బీఐ ఎకో వార్ప్‌’ ఓ అధ్యయన నివేదికను విడుదల చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మరణాలు 40వేలకు మించవు

ఎస్‌బీఐ అధ్యయన నివేదిక 


న్యూఢిల్లీ, జూన్‌ 2 : కరోనా సెకండ్‌ వేవ్‌లా, మూడోవేవ్‌ కూడా ఉధృతంగానే ఉండొచ్చంటూ ‘ఎస్‌బీఐ ఎకో వార్ప్‌’ ఓ అధ్యయన నివేదికను విడుదల చేసింది. ప్రస్తుత రెండోవేవ్‌ 108 రోజుల పాటు కొనసాగే అవకాశాలు ఉండగా, మూడో వేవ్‌ ప్రభావం 98 రోజులు ఉండొచ్చని అంచనా వేసింది. అయితే ప్రణాళికాబద్ధమైన సన్నద్ధత ద్వారా మూడో వేవ్‌లో మరణాలను చాలావరకు తగ్గించవచ్చని సూచించింది. రెండో వేవ్‌లో దేశంలో 1.69 కోట్ల కొత్త కొవిడ్‌ కేసులు నమోదుకాగా, మూడోవేవ్‌లో ఆ సంఖ్య మరింత పెరిగి 2 కోట్లకు చేరొచ్చని హెచ్చరించింది. తీవ్ర ఇన్ఫెక్షన్‌ కలిగిన కొవిడ్‌ కేసులు మూడోవేవ్‌లో గణనీయంగా తగ్గి, మొత్తం కేసుల్లో 5 శాతానికి పరిమితం అవుతాయని తెలిపింది. రెండో వేవ్‌లో సీరియస్‌ కేసులు 20ు మేర ఉన్న విషయాన్ని గుర్తుచేసింది. ఇక రెండో వేవ్‌లో 1.7 లక్షల మంది కరోనాతో మృతిచెందగా, మూడోవేవ్‌లో ఇది చాలావరకు తగ్గి 40వేలకు మించకపోవచ్చని పేర్కొంది. 

Updated Date - 2021-06-03T09:07:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising