ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూకేలో కరోనా కొత్త వేరియంట్‌

ABN, First Publish Date - 2021-05-15T07:24:51+05:30

మహారాష్ట్రలో ప్రారంభమైనట్టుగా భావిస్తోన్న బి1.617.2 రకం కరోనా వైరస్‌ ప్రస్తుతం యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో వేగంగా వ్యా పిస్తోంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లాక్‌డౌన్‌ ఎత్తివేతపై పునరాలోచన 


లండన్‌, మే 14: మహారాష్ట్రలో ప్రారంభమైనట్టుగా భావిస్తోన్న బి1.617.2 రకం కరోనా వైరస్‌ ప్రస్తుతం యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో వేగంగా వ్యా పిస్తోంది. ఈ రకం వైరస్‌ సోకిన కేసులు అక్కడ ఒక వారంలోనే 520 నుంచి 1313కి పెరిగాయి. దీంతో టెస్టులను, వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని యూకే నిర్ణయించింది. జూన్‌ 21నుంచి లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేయాలని భావించిన యూకే తాజా పరిణామాలతో పునరాలోచనలో పడింది. నార్త్‌వెస్ట్‌ ఇంగ్లండ్‌, లండ న్‌, మాంచెస్టర్‌ ప్రాంతాల్లో ఈ కేసులు ఎక్కువ గా బయటపడుతున్నాయి. కొత్త రకం వేరియం ట్‌ చాలా వేగంగా వ్యాపిస్తోందని, దీన్ని అరికట్టడానికి అవసరమైతే కఠినమైన ఆంక్షలు విధించడానికి వెనుకాడబోమని యూకే హెల్త్‌ సెక్రటరీ తెలిపారు. పాజిటివ్‌ వచ్చినవారి రక్త నమూనాలను జన్యు విశ్లేషణలకు పంపించామని, కొత్త వేరియంట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే బయటికొస్తాయని చెప్పారు. 

Updated Date - 2021-05-15T07:24:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising