ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిన్న ‘అనివార్యం’.. నేడు ‘ఆపొచ్చు’

ABN, First Publish Date - 2021-05-08T08:56:54+05:30

‘‘దేశంలో కరోనా మూడో వేవ్‌ అనివార్యం’’ అంటూ రెండు రోజుల క్రితమే (మే 5న) వ్యాఖ్యానించిన కేంద్ర ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు, ప్రొఫెసర్‌ కె.విజయ్‌రాఘవన్‌ ఇంతలోనే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మూడో వేవ్‌పై మాటమార్చిన కేంద్రం


న్యూఢిల్లీ, మే 7 : ‘‘దేశంలో కరోనా మూడో వేవ్‌ అనివార్యం’’ అంటూ రెండు రోజుల క్రితమే (మే 5న) వ్యాఖ్యానించిన కేంద్ర ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు, ప్రొఫెసర్‌ కె.విజయ్‌రాఘవన్‌ ఇంతలోనే మాటమార్చారు. ఒకవేళ కట్టుదిట్టమైన కట్టడి చర్యలను చేపడితే మూడో వేవ్‌ను ఆపొచ్చంటూ శుక్రవారం విలేకరుల భేటీలో ఆయన వెల్లడించారు. రాష్ట్ర, జిల్లా, పట్టణ స్థాయుల్లో కట్టడి చర్యల అమలు తీరును బట్టి ఫలితాలు ఉంటాయన్నారు. సర్వైలెన్స్‌, కట్టడి ప్రాంతాలు, కొవిడ్‌ పరీక్షలు వంటి కీలక అంశాలపై కేంద్రం మార్గదర్శకాల అమలుతో ఇన్ఫెక్షన్‌ వ్యాప్తిని నిలువరించవచ్చని చెప్పారు. కరోనా వేవ్‌ల ప్రతిదశలోనూ గరిష్ఠ, కనిష్ఠ స్థాయులు నమోదవుతుంటాయన్నారు. వైరస్‌ వ్యాప్తికి ఎక్కువ అవకాశాలున్నప్పుడు కరోనా కేసులు పెరుగుతాయని, అవకాశాలు లేనప్పుడు తగ్గుతాయని విజయ్‌రాఘవన్‌ తెలిపారు.

Updated Date - 2021-05-08T08:56:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising