ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Coronaపై అప్రమత్తత అవసరం

ABN, First Publish Date - 2021-11-01T18:01:01+05:30

రాష్ట్రంలో పండు గల సీజన్‌, వర్షాకాలం ప్రారంభం కావడంతో రెండు నెలలపాటు కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుం డా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కోరు తూ ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి జె.రాధా కృష్ణన్‌ జిల్లా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్లకు ఆరోగ్యశాఖ కార్యదర్శి లేఖ

చెన్నై: రాష్ట్రంలో పండు గల సీజన్‌, వర్షాకాలం ప్రారంభం కావడంతో రెండు నెలలపాటు కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుం డా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కోరు తూ ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి జె.రాధా కృష్ణన్‌ జిల్లా కలెక్టర్లకు లేఖ రాశారు. ప్రస్తుతం కరోనా వైరస్‌ వ్యాప్తి బాగా తగ్గు ముఖం పట్టినా, పండుగల సందర్భంగా ప్రజలు ఒకే చోట అధిక సంఖ్యలో గుమి కూడే అవకాశాలున్నాయని, ఆలయ వేడు కలకు అధిక సంఖ్యలో భక్తులు హాజరవు తారని, ఈ పరిస్థితుల్లో వైరస్‌ వ్యాప్తికి తోడుగా డెంగ్యూ జ్వరాలు కూడా పెరుగుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కళ్ళలో మంటలు, వాంతులు, తలనొిప్పి, ఎముకల నొప్పి, రక్త విరేచనాలు, మోకాళ్లనొప్పి, అలసట వంటివి డెంగ్యూ జ్వరం లక్షణాలని ఆయన వెల్లడిం చారు. ఈ పరిస్థితుల్లో జిల్లా కలెక్టర్లు కరోనా వైరస్‌ వ్యాప్తి అధికం కాకుండా డెంగ్యూ తదితర జ్వరాలు ప్రబలకుండా తగు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. రాబోయే  రెండు నెలలు కరోనా వైరస్‌ వ్యాప్తి అధిక మయ్యే సూచనలు కనిపిస్తుండటంతో జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా వ్యవహరిం చాలని ఆ లేఖలో ఆయన విజ్ఞప్తి చేశారు.


1.5 కోట్ల మందికి టీకాలు

రాష్ట్రవ్యాప్తంగా ఏడు విడతలుగా నిర్వ హించిన మెగా వ్యాక్సినేషన్‌ శిబిరాల ద్వారా 1.5 కోట్ల మందికి టీకాలు వేసినట్టు ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం తెలి పారు. శనివారం నిర్వహించిన మెగా వ్యాక్సినేషన్‌ శిబిరాల్లో 17.14లక్షల మంది టీకాలు వేసుకున్నారని వెల్లడించారు. ఈ శిబిరంలో మొదటి డోసుగా 6.26లక్షల మందికి, రెండో డోసుగా 10.87లక్షల మందికి టీకాలు వేసినట్టు ఆయన తెలిపారు. డిసెంబర్‌ లోగా వంద శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆయన చెప్పారు.

Updated Date - 2021-11-01T18:01:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising