ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముంబై కారుబాంబు కేసు: జ్యుడీషియల్ కస్టడీకి రియాజ్ కాజీ

ABN, First Publish Date - 2021-04-16T22:11:40+05:30

ముంబై కారుబాంబు కేసు కేసులో మరో పోలీస్ అధికారికి జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ స్థానిక కోర్టు ఇవాళ తీర్పు ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: ముంబై కారుబాంబు కేసు కేసులో అరెస్ట్ అయిన మరో పోలీస్ అధికారి, సచిన్ వాజే సన్నిహితుడు రియాజ్ కాజీకి జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ వెకేషన్ కోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది. ఈ నెల 23 వరకు ఆయనకు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తున్నట్టు కోర్టు పేర్కొంది. ప్రముఖ వ్యాపార వేత్త ముకేశ్ అంబానీ నివాసం ముందు పేలుడు పదార్థాలతో నింపిన కారును నిలిపిన కేసులో ఎన్ఐఏ అధికారులు గత నెలలో ప్రధాన నిందితుడు సచిన్ వాజేను అరెస్ట్ చేశారు. ఈ కారు యజమాని మన్సుక్ హీరేన్ అనుమానాస్పద మృతి కేసులో కూడా సచిన్ వాజే నిందితుడిగా ఉన్నారు. కాగా ఇదే కేసులో ఈ నెల 11న ఎన్ఐఏ అధికారులు ముంబై ఏసీపీ రియాజ్ కాజీని అరెస్ట్ చేశారు. ఆయన ఎన్ఐఏ కస్టడీ నేటితో ముగుస్తుండడంతో ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే కాజీ కస్టడీ పొడిగింపు కోసం ఎన్ఐఏ అడగకపోవడంతో కోర్టు ఆయనను జ్యుడిషియల్ కస్టడీకి పంపింది. ఈ కేసుకు సంబంధించిన కుట్రలో ప్రధాన నిందితుడు సచిన్ వాజేతో పాటు కాజీ పాత్రకూడా ఉందని ఎన్ఐఏ ఆరోపిస్తోంది. 

Updated Date - 2021-04-16T22:11:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising