ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delhi: నేటినుంచి సబ్సిడీ‌యేతర వంటగ్యాస్ సిలిండరు ధర పెంపు

ABN, First Publish Date - 2021-09-01T15:57:34+05:30

దేశంలో లక్షలాది గృహాలపై ప్రభావం చూపించే వంటగ్యాస్ సిలిండర్ల ధరలు బుధవారం నుంచి పెరిగాయి....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : దేశంలో లక్షలాది గృహాలపై ప్రభావం చూపించే వంటగ్యాస్ సిలిండర్ల ధరలు బుధవారం నుంచి పెరిగాయి.బుధవారం నుంచి సబ్సిడీ‌యేతర వంటగ్యాస్ సిలిండరు ధర 25రూపాయలు పెంచినట్లు ఐఓసీఎల్ ప్రకటించింది. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరను 75 రూపాయలు పెంచారు.14.2 కిలోల సబ్సిడీ లేని వంటగ్యాస్ సిలిండర్ ధర దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో రూ.884.50 కు పెరిగింది. సబ్సిడీయేతర ఎల్పీజీ సిలిండరు ధర ఈ ఏడాది జులై 1వతేదీన రూ.25.50 కు, ఆగస్టు 17 నుంచి మరో రూ.25లు పెంచారు.2014 మార్చి 1వతేదీన రూ.410.50 ఉన్న గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు రెట్టింపు అయింది.


అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు ,రూపాయి-డాలర్ మారకం రేట్ల ద్వారా దేశంలో ఎల్పీజీ ధరలు నిర్ణయిస్తున్నారు.14.2 కిలోల వంటగ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.859.50, కోల్‌కతాలో రూ.886.50,ముంబై నగరంలో రూ.859.50, చెన్నైలో రూ.875.50లుగా ఉందని ఐఓసీఎల్ వెల్లడించింది.25 రూపాయల పెంపుతో దేశీయ ఎల్పీజీ సిలిండర్ ధర కూడా బుధవారం నుంచి వివిధ నగరాల్లో పెరుగుతోంది.


Updated Date - 2021-09-01T15:57:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising